త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎందరో త్యాగధనుల కృషి ఫలాలనే నేడు మనం అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా పలువురు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, మేడ్చల్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, గచ్చిబౌలిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్టు (జీహెచ్ఐఏఎల్) సీఈఓ ప్రదీప్ ఫణికర్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆవరణలో, ఆర్టీఏ కార్యాలయాల్లో, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో, చంచల్‌గూడ, చర్లపల్లి కేంద్రకారాగారం, సీఆర్ఫీఎఫ్లో సంబంధిత అధికారులు జెండాను ఎగురవేశారు..
హైదరాబాద్ కలెక్టరేట్లో...
సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ప్రజా సేవలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో వ్యవహరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆమె ఎగురవేశారు. అనంతరం వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. ఎందరో త్యాగధనుల కృషి ఫలాలనే నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అనిల్‌కుమార్, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, సంక్షేమ శాఖ అధికారులు రామారావు, మాన్యానాయక్, ఉద్యోగ సంఘ నాయకులు కృష్ణాయాదవ్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో...
రంగారెడ్డి, జనవరి 26, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలన్నింటిని ప్రతీ పేద ప్రజలకు చేరేలా నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అదే విధంగా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ హరీష్ , డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ కవిత, డీఆర్వో హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ ఆవరణలో ...
మేడ్చల్, జనవరి26(నమస్తే తెలంగాణ): మేడ్చల్ కలెక్టరేట్ ఆవరణలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచుతామని అన్నారు. ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్యాంసన్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, డీఆర్వో లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ జ్యోతి, డీపీవో పద్మజారాణి, డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రవిప్రకాశ్, కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆవరణలో...
నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆవరణలో కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ జ్యుడీషియరీ సభ్యులు నాడిపల్లి ఆనంద్‌రావు, కమిషన్ నాన్ జ్యుడీషియరీ సభ్యులు మహ్మద్ ఇర్ఫాన్ మోయినుధ్దీన్, మాజీ సభ్యులు ఇస్మా యిల్, కార్యదర్శి విద్యాధర్భట్, ఏఆర్ షాబుధ్దీన్, పీఆర్వో శ్రీనివాస్‌రావు, డీఎస్పీ సుభాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి కేంద్ర కారాగారంలో..
చర్లపల్లి, జనవరి 26 : చర్లపల్లి కేంద్ర కారాగారంలో జైలు సూపరింటెండెంట్ సంపత్, చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు(ఖైదీల వ్యవసాయ క్షేత్రం)లో సూపరింటెండెంట్ డాక్టర్ దశరథరామిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, హెడ్‌వార్డర్ మోహన్‌రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశం, రామకృష్ణ, జైలర్లు మొగిలేశ్, దేవిసింగ్, పరుశురాం, జ్యోతీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ జైలర్లు కృష్ణ, జైలరు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చార్మినార్, జనవరి 26 : సీఆర్పీఎఫ్లో దక్షిణ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీపీ మహేష్లడ్హా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పలువురికి డైరెక్టర్ జనరల్ డిస్క్ అవార్డులను అందించారు. అవార్డును అందుకున్నవారిలో వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు
మాదన్నపేట,జనవరి 26 : చంచల్గూడలోని జైళ్లశాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న సీకా పరేడ్ గ్రౌండ్లో తివర్ణపతాకాన్ని డీజీ రాజీవ్ త్రివేదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైళ్లశాఖ సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఐజీ సైదయ్య, జైలు సూపరింటెండెంట్లు శ్రీనివాస్, వెంకటలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో...
శంషాబాద్, జనవరి 26: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్టు (జీహెచ్ఐఏఎల్) సీఈఓ ప్రదీప్ ఫణికర్ జాతీయ జెండా విష్కరించారు. ఈ సందర్భంగా క్విక్ రెస్పాన్స్ టీం, సీఐఎస్ఎఫ్, జీఎంఆర్ రక్ష సెక్యూరిటీ, ఏఆర్ఎఫ్ఎఫ్, కమాండోల విన్యాసాలు, మాక్‌డ్రిల్ ఆకట్టుకున్నాయి. డాగ్‌స్కాడ్ మార్చ్ అలరించింది. ఈ వేడుకల్లో ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎంకే సింగ్, జీహెచ్ఐఏఎల్ హెడ్ సెక్యూరిటీ అధికారి భరత్ కాన్ధూర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఆఫీసు ఎదుట ఎంపీ రంజిత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
నిసాలో...
ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంతోనే మనకు స్వాతంత్రం సిద్ధించిందని, వారి స్ఫూర్తితో అన్ని రకాల వివక్షలను రూపుమాపేందుకు అంతా కృషి చేయాలని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా) డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మంగళవారం నిసాలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.. సిబ్బం ది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, కరోనా వంటి సంక్లిష్ట సమయంలోనూ దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది విశిష్ట సేవలందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నిసా ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడండి
- పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి
- ఆహార భద్రత పథకంలో నిర్లక్ష్యం తగదు
- ఉదాత్తురాలు వాణీదేవి
- సభ్యత్వం స్వీకరించిన వలసజీవులు..
- రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
- మిషన్ భగీరథ నీటిపై అవగాహన
- ఎమ్మెల్యేలదే బాధ్యత
- జోరుగా సభ్యత్వ నమోదు