త్రికరణ శుద్ధితో పాలన

తెలంగాణ రాష్ట్రంలో త్రికరణ శుద్ధితో పాలన కొనసాగుతున్నది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ పదోన్నతులు కల్పించడం జరుగుతున్నది. రెండుమూడు రోజుల్లోనే పీఆర్సీపై చర్చలు ప్రారంభమై త్వరలోనే ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ లభిస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కేశవరావు అన్నారు. మంగళవారం అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, నాంపల్లిలోని టీజీవో భవన్ ఆవరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ భవన్లో ఎంపీ కె.కేశవరావు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు.
టీజీవో భవన్లో..
సుల్తాన్‌బజార్, జనవరి 26 : నాంపల్లిలోని టీజీవో భవన్ ఆవరణలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో అధ్యక్షుడు ఎం.రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు రవీందర్‌కుమార్, సహదేవ్, రవీందర్రావు, వెంకటయ్య, నగర శాఖ అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ, స్వర్ణలత, సుజాత, సబిత, ఎక్సైజ్ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, శ్రీధర్, శివకుమార్, శివరామకృష్ణ, మాన్యనాయక్, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ : భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన ఘనత భారతదేశానికే దక్కిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపాల్ చైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల
- వ్యాట్, సుంకాలెత్తేస్తే పెట్రోల్ చౌక.. కానీ..!!
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- దారుణం : అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లను కడతేర్చాడు!
- ఇంటి రుణం రూ.75 లక్షల్లోపు 6.7% వడ్డీ.. దాటితే..!!
- క్షమించండి.. అంటూ చెవులు పట్టుకుని బస్కీలు తీసిన నేత
- వీడియో : భోజనం భారత్‌లో.. నిద్ర మయన్మార్‌లో
- ట్రిపుల్ఆర్ ఫొటోల లీక్‌పై రాజమౌళి సీరియస్
- అసెంబ్లీలో చొక్కా విప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వారం రోజులు సస్పెండ్
- కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన రియల్మీ