రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం

- అగ్రవర్గాల్లోని నిరుపేదలకు రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- నగరవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
- పటాకులు కాల్చి.. స్వీట్లు పంచి సంబురాలు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగావకాశాల్లో పదిశాతం రిజర్వేషను ్ల అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు, నియామకాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్గాల్లోని నిరుపేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడంతో పాటు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబు రాల్లో మునిగిపోయారు.
మంత్రి కేటీఆర్‌కు రెడ్డి జేఏసీ కృతజ్ఞతలు
మేడ్చల్ రూరల్, జనవరి 22: ఈడబ్ల్యూఎస్ అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం రెడ్డి జేఏసీ నేతలు మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక రెడ్డి కార్పొరేషన్, పేదరెడ్డిల కోసం విదేశీ విద్యానిధిని ఏర్పాటు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ అపమ్మగారి రాంరెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వసంతారెడ్డి, నాగమణి రెడ్డి, రాధికారెడ్డి పాల్గొన్నారు.
అగ్రవర్గాల్లోని పేదల శ్రేయస్సే ప్రభుత్వం లక్ష్యం
అగ్రవర్గాల్లోని పేదలను ఆదుకునే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శుక్రవారం కొత్తపేట మారుతీనగర్‌లోని తన నివాసం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్రవర్గాల్లో నిరుపేదలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ నర్సిరెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భూపేశ్‌రెడ్డి, నాయకులు శరత్చంద్ర పాల్గొన్నారు. - ఎల్బీనగర్, జనవరి 22
మనసున్న మారాజు సీఎం కేసీఆర్
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాగోల్ డివిజన్ పరిధి కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలోని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించగా.. పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మనస్సున్న మారాజు అన్నారు. కార్యక్రమంలో పబ్బ చంద్రశేఖర్, ఐవీఎఫ్ మహిళా సంఘం అధ్యక్షురాలు తమన్న సుజాత, సభ్యులు ఉప్పల స్వప్న, కటకం శ్రీనివాస్, ఉట్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. - మన్సూరాబాద్, జనవరి 22
అగ్రవర్గ పేదలకు మంచిరోజులు
ఖైరతాబాద్, జనవరి 22: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షించదగినదని తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయంతో అగ్రవర్గ పేదలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు లభించడం ఖాయమన్నారు. అగ్రవర్గ పేదలకు నిధులు, ప్రతి నియోజకవర్గంలో గురుకులాలు, బీపీఓ కుటుంబాలకు చేయూత అంశాలను పరిశీలించాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29న చేపట్టనున్న ఓసీల మహాగర్జనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్‌ది సాహసోపేత నిర్ణయం
ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తార్నాక డివిజన్ లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. అగ్రవర్గాల్లోని పేదలను ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలని నిర్ణయించారన్నారు.
అవకాశాలు పెరగడం ఖాయం
అగ్రవర్గాల్లోని నిరుపేదలకు రిజర్వేషన్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. పది శాతం రిజర్వేషన్లు ప్రకటించడం సాహసేపోత నిర్ణయం. సీఎం కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఎంతో లాభం కలుగుతుంది. - శేష బట్టర్ సాహితి, బీటెక్ స్టూడెంట్
అగ్రవర్గ పేదల్లో ఆశలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలోని అగ్రవర్గాల్లోని పేదల్లో ఆశలు చిగురించాయి. ఓ పక్క అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూనే మరో పక్క అగ్రవర్గ పేదలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. -దోర్బల కృష్ణమూర్తి శర్మ, మహాభాగ్యనగర బ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకుడు
ధైర్యం వచ్చింది..
అగ్రవర్గాల్లో వెనుకబడిన వారికి ఉద్యోగ, విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ప్రభుత్వ నిర్ణయంతో మాలో ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగం సంపాదిస్తామన్న ధీమా వచ్చింది. -సంతోష్, బీటెక్ విద్యార్థి
ఈజీగా ఉద్యోగాలు
బ్రాహ్మణ వర్గానికి చెందిన మాకు ఎంత చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాదన్న బావన ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు అది పటాపంచలు అయ్యింది. అగ్రవర్గాల్లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. - అలేఖ్య ద్వివేది, డిగ్రీ విద్యార్థి
తాజావార్తలు
- బీజేపీ పాలన.. బ్రిటీషర్లను మించిపోయింది: కేజ్రీవాల్
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ఎమ్మెల్సీ కవిత
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు