రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?

- అరెస్ట్‌కు రెడ్‌కార్నర్ నోటీసులు
- పరారీలో ఉన్నవారి వివరాలు ఇంటర్‌పోల్‌కు
- స్వదేశ డైరెక్టర్లపై ఎల్ఓసీ జారీ
తెలంగాణ పోలీసుల దెబ్బకు ఇన్స్టంట్ రుణ యాప్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న చైనీయులు భారతదేశం విడిచి చైనాకు పారిపోయినట్లు తెలిసింది. డిసెంబర్లో సైబరాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్, రాచకొండ పోలీసులు ఇన్స్టంట్ రుణయాప్‌ల ఫిర్యాదులపై అతి వేగంగా స్పందించారు. ఆర్బీఐ, గూగుల్‌లకు లేఖలు రాసి వారి ఆగడాలపై వివరించారు. అంతేకాకుండా ఈ ఇన్స్టంట్ రుణా యాప్‌ల్లో డైరెక్టర్లుగా ఉన్న నలుగురు చైనీయులను మూడు పోలీసు కమిషనరేట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ ఆన్లైన్ ఇన్స్టంట్ రుణయాప్‌ల సంస్థలను గుర్తించి.. వాటి వసూళ్లకు పాల్పడుతున్న కాల్ సెంటర్లలో సోదాలు జరిపి వాటిని మూయించారు. అంతేకాకుండా దాదాపు రూ.200 కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ చేశారు.
తాజాగా.. ఈ రుణయాప్‌లపై దర్యాప్తును వేగవంతం చేయడంతో పోలీసులకు కొత్త విషయం తెలిసింది. ఆన్లైన్ ఇన్స్టంట్ రుణయాప్‌ల సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న చైనీయులు డిసెంబర్లో తిరిగి చైనాకు వెళ్లిపోయారని, ఆ కంపెనీల్లో ఉన్న మన దేశ డైరెక్టర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలిసింది. దీంతో సైబరాబాద్ పోలీసులు ఇన్స్టంట్ రుణయాప్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న చైనా దేశీయులపై రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మెరకు చైనా దేశానికి చెందిన వారి ఫొటోలు, ఇతర వివరాలను ఇంటర్‌పోల్‌కు పంపించనున్నా రు. ఇక.. మన దేశానికి చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేసేందుకు .. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, షిఫ్యార్డులు, ఇరత అంతర్జాతీయ రవాణా కేంద్రాలకు లుక్ ఔట్ నోటీసును జారీ చేశారు. ఓ నిందితుడిని సైబరాబాద్ పోలీసులు బీహార్‌లో ఛేజింగ్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- మార్చిలోనే మధురఫలం
- రాష్ట్రంలో 39 డిగ్రీలకు చేరిన ఎండలు
- 27-02-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- జీవకోటికి.. ప్రాణవాయువు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్‌షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు