పాత మలక్‌పేటలో రీపోలింగ్

- రీపోలింగ్.. ప్రశాంతం
- 38.46% ఓటింగ్..
- 2016 కంటే 1.15% తక్కువ నమోదు
- పోలింగ్ బూత్‌లను పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు
- పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భారీ బందోబస్తు
- విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టీకరణ
మలక్‌పేట : పాత మలక్‌పేట డివిజన్-26లో గురువారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. డివిజన్లో మొత్తం 54,655 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 27,889, మహిళా ఓటర్లు 26,763, ఇతరులు ముగ్గురు ఉన్నారు. 25 పోలింగ్ కేంద్రాల్లో 69 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో 39.61% పోలింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. ఈసారి ఒకే ఒక్క డివిజన్లో రీపోలింగ్ నిర్వహించాల్సి రావటంతో నగర సీపీ అంజనీకుమార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. డజన్ మంది పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ బలగాలు, అశ్వక దళాలను మోహరించి భారీ బందోబస్తును ఏర్పాటుచేయటంతో ఒక వర్గానికి చెందిన ప్రాంతంలో రిగ్గింగ్‌కు తావులేకుండా పోయింది. పోలీసు ఉన్నతాధికారులతోపాటు నగర సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ చౌహాన్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్, ఈస్ట్‌జోన్ జాయింట్ కమిషనర్, డీసీపీ రమేశ్‌తోపాటు డీసీపీలు కరుణాకర్ డివిజన్లోని పోలింగ్ బూత్‌లను సందర్శించి పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు.
48 గంటల పాటు ర్యాలీలు నిషేధం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక సీనియర్ అధికారి, అడిషనల్ డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు, మూడు కౌంటింగ్ కేంద్రాలకు డీసీపీ స్థాయి అధికారిని నియమించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రజలు ఎవరూ రావొద్దని, కేవలం అనుమతులు (పాసులు) తీసుకున్న వారు మాత్రమే రావాలని సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని రాబోయే 48 గంటల వరకు విజయోత్సవ ర్యాలీలకు నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
- దావత్ వద్దు.. సేవే ముద్దు
- ప్రగతి పథంలో ‘మేడ్చల్' పురపాలికలు
- కుదిరిన ఒప్పందం
- ఆర్థికవృద్ధిలో కస్టమ్స్ది కీలకపాత్ర
- నేడు ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో
- మరింత విశాలంగా..బంజారాహిల్స్ రోడ్ నం. 12
- ఎక్స్ ఆఫీషియోల లెక్క తేల్చే పనిలో బల్దియా
- తొలిసారిగా నగరంలో 56 అంతస్తుల ఎత్తయిన భవనం
- దోమలపై దండయాత్ర
- పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు