శనివారం 27 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 27, 2021 , 05:10:09

రాణిగంజ్‌ ఆర్‌యూబీ విస్తరణకు చర్యలు

రాణిగంజ్‌ ఆర్‌యూబీ విస్తరణకు చర్యలు

హైదరాబాద్‌  : గ్రేటర్‌లోని రద్దీ మార్గాల్లో ట్రాఫిక్‌కు జీహెచ్‌ఎంసీ శాశ్వత పరిష్కారం చూపుతున్నది. సాఫీ ప్రయాణానికి ప్రధాన సమస్యగా మారిన ఆర్‌యూబీలను విస్తరిస్తున్నది. ఇప్పటికే మలక్‌పేట, హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ల వద్ద ఆర్‌యూబీలను విశాలంగా మార్చిన అధికారులు తాజాగా రాణిగంజ్‌లో ఇరుకుగా ఉన్న అండర్‌ బ్రిడ్జిని విస్తరించి ఆధునీకరించాలని నిర్ణయించింది. ప్యారడైజ్‌ నుంచి రాణిగంజ్‌ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు వెళ్లే మార్గం అత్యంత రద్దీగా మారిందని, రాణిగంజ్‌ అండర్‌ బ్రిడ్జిని ఇరువైపులా విస్తరించాలని ట్రాఫిక్‌ పోలీసులు నివేదించారు. దీనిపై ఇటీవల జీహెచ్‌ఎంసీలో జరిగిన సమన్వయ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు రాణిగంజ్‌ ఆర్‌యూబీ విస్తరణకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రూ.58 లక్షలను సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు కేటాయించగా, ఆర్‌యూబీ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్‌ఆర్‌డీసీఎల్‌ అధికారులు రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ పనులు కార్యరూపంలోకి రానున్నాయి. 


VIDEOS

logo