శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 21, 2020 , 00:33:54

సీనియర్‌ ఐపీఎస్‌లకు రంజాన్‌ బందోబస్తు బాధ్యతలు

సీనియర్‌ ఐపీఎస్‌లకు రంజాన్‌ బందోబస్తు బాధ్యతలు

హైదరాబాద్ : రంజాన్‌ను పురస్కరించుకుని నగరంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ 12మంది సీనియర్‌ ఐపీఎస్‌లను నియమించారు.  వీరంతా బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవసరమైన చర్యలను తీసుకుంటారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 22వ తేదీ రంజాన్‌ ఆఖరి శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు, 24,25 తేదీల్లో రంజాన్‌ పండుగ సందర్భంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు శాంతి భద్రతలను నిరంతరం సమీక్షిస్తారు. 
logo