హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, గండిపేట్, శంషాబాద్, గగన్‌పహాడ్, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్,ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, ఛత్రినాక, బార్కస్, గాజులరామారం, షాపూర్ నగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. వర్షం రాకతో లోతట్టు ప్రాంతాలతోపాటు రహదారులపై వరద నీరు నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.