e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home హైదరాబాద్‌ 12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్‌ సేవలు

12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్‌ సేవలు

12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్‌ సేవలు

భారతీయ రైల్వే మరో ప్రయోగం చేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వేలకు సంబంధించి అన్ని రకా ల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. పైగా అన్ని రాష్ర్టాల ప్రజలకు సులవుగా అర్థం కావడం, అందుబాటులో ఉండే విధంగా దేశ వ్యాప్తంగా మొత్తం పన్నెండు రకాల భాషల్లో 139 హెల్ప్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 182 సేవలను పూర్తిగా రద్దు చేసి, ఆ సేవలను 139 పరిధిలోకి తెచ్చింది. అలాగే, ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చన్నారు. అయితే దీనికి కేవలం స్మార్టు ఫోన్‌లే అవసరం లే దు. అన్ని రకాల మొబైల్‌ ఫోన్ల ద్వారా ఈ సేవలను అందిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ సేవల ద్వారా ప్రయాణికుల సమాచారం, రైళ్ల రాకపోకలు, సీట్ల రిజర్వేషన్లు, పీఎన్‌ఆర్‌ నంబర్‌, ఛార్జీలు, అలారం, వీల్‌చైర్‌ బుకింగ్‌, భోజనం బుకింగ్‌ వంటి అం దుబాటులోకి తెచ్చారు. వాటితో పాటు జనరల్‌ ఫిర్యాదులు, విజిలెన్స్‌ సంబంధ ఫిర్యాదులు, పార్సిల్స్‌ లేదా వస్తువులు ఫిర్యాదులు, ఐఆర్‌సీటీసీ, ఫిర్యాదుల స్టేటస్‌, కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మా ట్లాడే అవకాశం కూడా కల్పించారు. ఇప్పటి వరకు సగటున 139 హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు 3,44,513 కాల్స్‌/ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయన్నారు. ఐవీఆర్‌ఎస్‌ విధానం ప్రకారం, 139కి ఫోన్‌ చేయాలనున్న ప్రయాణికులు తమకు కావాల్సిన సమస్య గురించి తెలుసుకోడానికి ఫోన్‌ కీ బోర్డు ద్వారా ఆప్షన్లు తెలుసుకోవడానికి సూచించిన నంబర్లను ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది. 

Advertisement
12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్‌ సేవలు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement