శనివారం 23 జనవరి 2021
Hyderabad - Nov 22, 2020 , 20:18:23

దివంగత సీఎం వైఎస్‌ఆర్‌పై రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు

దివంగత సీఎం వైఎస్‌ఆర్‌పై రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : బీజేపీ నేతలు రోజు రోజుకూ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. చనిపోయిన వారిగురించి చులకనగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ప్రజలను రెచ్చగొట్టి హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు ఇవాళ మరిన్ని పిచ్చికూతలు కూశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఇవాళ ఘోరంగా మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌పై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారు.  ఎనకటికి ఒకాయన పావురాల గుట్టలో పావురమై పోయాడు. మంత్రి కేటీఆర్‌కు కూడా ఆయనకు పట్టిన గతే పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునందన్‌ మాట్లాడిన వీడియో..logo