శనివారం 23 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 10:16:10

ఓటర్లకు ప్రశాంత వాతావరణం

ఓటర్లకు ప్రశాంత వాతావరణం

హైదరాబాద్‌  : బంగారు భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఓటేయాలనీ, ఓటు వేయడానికి  ప్రశాంత వాతావారణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు.  నేరేడ్‌మెట్‌, జవహర్‌నగర్‌, కుషాయిగూడ ప్రాంతాల్లో దాదాపు 250 మంది పోలీసు సిబ్బందితో 5 కిలోమీటర్ల మేర ఫ్లాగ్‌మార్చ్‌ను నిర్వహించారు. నాలుగు వార్డుల్లో పోలీసులు నడుచుకుంటూ గస్తీని నిర్వహించారు. సీపీ మహేశ్‌ భగవత్‌, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, అదనపు డీసీపీ షమీర్‌, ఏసీపీ శివకుమార్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు.  logo