e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home హైదరాబాద్‌ మూడు చుక్కలు.. గంటల కొద్దీ మత్తు

మూడు చుక్కలు.. గంటల కొద్దీ మత్తు

  • ద్రవ పదార్థంలో గంజాయి సరఫరా
  • ముగ్గురి అరెస్టు n రూ.10 లక్షల హషీష్‌ ఆయిల్‌ స్వాధీనం

సిటీబ్యూరో, సెస్టెంబరు 16(నమస్తే తెలంగాణ): మత్తు పదార్ధాలలో ప్రధానమై న గంజాయి అమ్మకాలపై నగర పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించారు. మత్తు పదార్ధాల అమ్మకందారులు పోలీసు అధికారుల కళ్లు గప్పి లా వాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి సరఫరాదారుల రూట్లను పోలీసులు, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ అధికారులు దిగ్బంధం చేయడంతో అక్రమ సరఫరాదారులు గంజాయి ముడి సరుకు సరఫరాను నిలిపివేశారు. అనేక మార్గాల్లో గంజాయిని సరఫరా చేసి పోలీసులకు చిక్కిన అక్రమ సరఫరాదారులు ఇప్పుడు పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ముడి సరుకును ద్రవ పదార్థంలోకి మార్చి వాటిని అడ్డదారి లో ఏపీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

ఐతే, దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ ఎస్‌ఓటీ, శాంతి భద్రతల పోలీసులు గురువారం ముగ్గుర్ని అరె స్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే గంజాయి ఆయిల్‌ (హషీష్‌)ను స్వాధీనం చేసుకున్నా రు. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీసు కమిషనర్‌ కా ర్యాలయంలోని పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించిన ప్రకారం, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు చెం దిన మల్లప్పగారి శ్రీకాంత్‌ రెడ్డి, చాకలి వెంకటేష్‌లు ఇద్దరు డ్రైవర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఇద్దరు ప్రస్తుతం పటాన్‌చెరు ప్రాంతంలో ఉంటున్నారు.

- Advertisement -

విశాఖపట్నానికి చెందిన తాళ్లవలస కొండల్‌ రావు వలస వచ్చి సిద్ధిపటే జగదేవ్‌పూర్‌ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే, ఈ ముగ్గురికి పరిచ యం ఉండి, గతంలో గంజాయి దందా చేసిన అనుభ వం సైతం ఉంది. పోలీసుల నిఘా, సోదాలు తరచుగా జరుగుతుండటంతో ఈ ముగ్గురు కొద్ది రోజుల పాటు గంజాయి దందా జోలికి పోలేదు. అయితే, ఇటీవల విశాఖలోని గంజాయి దందా చేసే వారు రూటు మార్చి గంజాయి ముడి సరుకును ద్రవ పదార్థంలోకి మార్చి, తిరిగి ఈ ముగ్గురు గంజాయి ఆయిల్‌ (హషీష్‌)తో అక్రమ వ్యాపారం చేద్దామని సిద్ధపడ్డారు.

దీని కోసం కొండల్‌రావుకు పరిచయం ఉన్న వెంకట రాజు దగ్గర విశాఖలో 3 లీటర్ల హషీష్‌ ఆయిల్‌ను లక్ష రూపాయల కు కొనుగోలు చేశారు. దానిని నగరానికి తీసుకువచ్చి 10 మిల్లిలీటర్ల ద్రవాన్ని రూ.3000లకు అమ్మేందుకు పథకం వేశారు. దీంట్లో భాగంగా ఈ మత్తు ఆయిల్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తుండ గా ఎస్‌ఓటీ, ఎల్బీనగర్‌ పోలీసులకు సంయుక్తంగా అంది న సమాచారంపై ఆపరేషన్‌ను నిర్వహించి ఈ ముగ్గుర్ని అరె స్టు చేశారు.

మత్తు బాబులకు ఆయిల్‌

గంజాయి ముడి పదార్థం నుంచి తయారు చేస్తున్న హషీష్‌ ఆయిల్‌ మత్తు బాబులకు జోరుగా కిక్కును అందిస్తుంది. ఈ హషీష్‌ ఆయిల్‌ 3 చుక్కలను సిగరేట్‌లో వేసుకుని పీలిస్తే ఆ మత్తు దాదాపు 7 నుంచి 8 గంటల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇలాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉన్నా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ముగ్గుర్ని పట్టుకున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌, ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ రెడ్డి, సిబ్బంది, అధికారులను సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు. సమావేశంలో ఎల్బీనగర్‌ డీసీపీ సంప్రీత్‌ సింగ్‌, ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరోచోట నలుగురి అరెస్ట్‌

వెంగళరావునగర్‌: నిషేధిత మాదక ద్రవ్యాలైన హాషిష్‌ ఆయిల్‌, గంజాయి కలిగి ఉన్న నలుగురిని ఎస్సార్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు ప్రకారం, పెట్రోలింగ్‌ విధుల్లో భాగంగా ఎస్సై శంకర్‌ అతని సిబ్బంది బుధవారం రాత్రి వెంగళరావునగర్‌ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు కనపడ్డారు. పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిని వెంబడించిన పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. వారిలో ఐటీ ఉద్యోగులైన సిరిల్‌ వరికేటి(24) కె.వెంకటసాయి అంకిత్‌(28), డిగ్రీ విద్యార్థి అబ్దుల్‌ ఆసిద్‌(24), టైర్ల దుకాణం నిర్వాహకుడు ఎం.అస్లం(25) ఉన్నారు. వారి వద్ద సోదా చేయ గా, ఒక్కొక్కటీ 5 గ్రా॥ కలిగిన రెండు హాషిష్‌ ఆయిల్‌ సీసాలు, 5 గ్రా॥ గంజాయి, మరో కత్తి లభ్యమైంది. మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement