బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Jul 01, 2020 , 00:44:44

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

కొండాపూర్‌, జూన్‌ 30 : సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని కొండాపూర్‌ డివిజన్‌ పత్రికానగర్‌లో ఏర్పడిన డ్రైనేజీ సమస్యను డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ హమీద్‌ పటేల్‌, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, వెంటనే పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పత్రికానగర్‌లోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్‌ మేనేజర్‌ ప్రభాకర్‌, ఏఈ శ్రీనివాస్‌, డివిజన్‌ అధ్యక్షుడు కృష్ణగౌడ్‌, నాయకులు పద్మారావు, రాంబాబు, వేణుగోపాల్‌రెడ్డి, రమణయ్య, కాలనీవాసులు శ్రీనివాస్‌రావు, ఆంజనేయులు, రామకోటయ్య, సుధాకర్‌, నాగేశ్వర్‌రావు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.