కొవిడ్ రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాలుస్వల్ప లక్షణాలున్నవారికే అవకాశంఎప్పటికప్పుడు అందుబాటులో వైద్యులుఉచిత సేవలందిస్తున్న సేవాభారతి200 పడకలతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు హైదరాబాద్‌లో పలు హోటళ్లు కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాలుగా మారుతున్నాయి.కరోనా వ్యాప్తి నేపథ్యంలో కస్టమర్లు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోటళ్ల యాజ మాన్యాలు కొత్త ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి.అందుబాటులో ఉన్న వైద్యులతో అవగాహన కుదుర్చుకొని స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు ఐసొలేషన్ షెల్టర్లుగా సేవలందిస్తున్నాయి.కొవిడ్ రెండో దశలో వైరస్ వేగంగా వ్యాపిస్తుండటం తో పాజిటివ్ వస్తే కుటుంబంతో ఉండలేనివారి కోసం ప్రభుత్వం కూడానగరంలో ఎనిమిది ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.అదే దారిలో పలు హోటళ్లు ఐసొలేషన్ / క్వారంటైన్ కేంద్రాలుగా మారుతున్నాయి.హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లోని హోటళ్లు కొవిడ్ సేవలందిస్తున్నాయి. స్వల్ప లక్షణాలుంటేనే.. ఈ ఐసోలేషన్ కేంద్రాల్లో స్వల్ప లక్షణాలున్నవారిని మాత్రమే చేర్చుకుంటున్నారు.పాజిటివ్ నిర్ధారణ అయ్యి జలుబు, ఒళ్లునొప్పులు, జ్వరం, తలనొప్పి తదితర లక్షణాలున్నవారికి మాత్రమే గదులు అద్దెకిస్తున్నారు.వైద్యులతో ముందుగానే అవగాహన ఒప్పందం ఉండటంతో వారు హోటళ్లకు వచ్చి రోగులకు చికిత్స అందించడంతో పాటు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరముంటే అక్కడి నుంచే నేరుగా దవాఖానలకు తరలించేలా హోటళ్లవద్ద అంబులెన్స్‌లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఉచిత వసతి కల్పిస్తున్న సేవా భారతి సేవాభారతి సంస్థ నగరశివారులోని రాష్ట్రీయ విద్యాకేంద్రం పాఠశాలలో (ఆర్వీకే అన్నోజిగూడ) కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.200 పడకల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నది.ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చినవారికి మాత్రమే ఇక్కడ ఐసొలేషన్‌లో ఉంచి ఉచిత వసతి, చికిత్సనందిస్తున్నారు.ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆహారం సమకూర్చడంతోపాటు, యోగా, వ్యాయామం చేయిస్తున్నారు.24 గంటలపాటు డాక్టర్లను అందుబాటులో ఉంచి సేవలందిస్తున్నారు.వివరాల కోసం 040-48212529 నంబర్లను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచించారు. పలు ప్రైవేటు కేంద్రాలు జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ : 9121155500/ 9121355500ఫ్యాబ్ హోటల్స్ : 98858 88125టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ : 040- 27563344హోటల్ టూరిస్ట్ ప్యాలస్, కోఠి : 040 66668686హోటల్ హర్షా గ్రాండ్ : 96151 58888ఆదిత్యా గ్రీన్‌పార్క్, అమీర్‌పేట : 18605000202హోటల్ ఏషియన్ ఇంటర్నేషనల్ : 98491 81470హోటల్ ఆదిత్యాపార్క్ : 92468 87194హోటల్ సహర్ష్ గ్రాండ్ : 95334 44441కాల్హెల్త్ : 91335 57799సంగ్రామ్ : 82494 92712 ప్రభుత్వ కొవిడ్ కేర్ సెంటర్లు నిజామియా టీబీ దవాఖాన 040 24522048నేచర్ క్యూర్ దవాఖాన 040- 23731786ఆయుర్వేద దవాఖాన, ఎర్రగడ్డ 040 - 23810236సరోజినీదేవి కంటి దవాఖాన, మెహిదీపట్నం : 040 23317274హోమియోపతి కళాశాల, రామంతాపూర్కొండాపూర్ ఏరియా దవాఖానవనస్థలిపురం ఏరియా దవాఖానన్యాక్ బిల్డింగ్, మాదాపూర్