సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - May 27, 2020 , 02:36:59

ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలిస్తే..‘క్యూఆర్‌'తో కొల్లగొట్టారు

ఓఎల్‌ఎక్స్‌లో  ప్రకటనలిస్తే..‘క్యూఆర్‌'తో కొల్లగొట్టారు

హైదరాబాద్ : ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలిస్తే.. గూగుల్‌ పేకు క్యూఆర్‌ కోడ్‌లు పంపి వారి ఖాతాలు ఖాళీ చేశారు. తక్కువ ధరకు  శానిటైజర్లను విక్రయిస్తున్నామని ఓ మహిళ ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనికి స్పందించిన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి అడ్వాన్సుగా డబ్బు పంపిస్తానని చెప్పి రెండు సార్లు గూగుల్‌ పేకు క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. కోడ్‌ను ఓపెన్‌ చేయడంతో ఆమె ఖాతా నుంచి 1.29 లక్షలు బదిలీ అయ్యాయి.

కంప్రెషర్‌లు కొంటానని..

నగరానికి చెందిన ఓ వ్యక్తి కంప్రెషర్‌లు విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన పోస్టు చేశాడు. వాటిని కొనుగోలు చేస్తానని చెప్పిన సైబర్‌ నేరగాడు గూగుల్‌ పేకు క్యూఆర్‌ కోడ్‌ను పంపాడు. దాన్ని  స్కాన్‌ చేయగానే బాధితుడి ఖాతా నుంచి  రూ. 1.50 లక్షలు ఖాళీ అయ్యాయి.

రూ. 1.89 లక్షలు టోకరా..

సెకండ్‌ హ్యాండ్‌ ఏసీలు, కూలర్లు విక్రయిస్తామని ఇద్దరు యువకులు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చారు. ఇది చూసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వీరికి ఫోన్‌ చేసి ఏసీలు కొనుగోలు చేస్తామని, అందుకు అడ్వాన్సుగా డబ్బులు పంపిస్తామన్నారు. గూగుల్‌ పేకు క్యూఆర్‌ కోడ్‌ను పంపించారు. వీటిని స్కాన్‌ చేయగానే ఒకరి నుంచి 1.05 లక్షలు, మరొకరి  ఖాతా నుంచి రూ. 84 వేలు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లాయి. బాధితులు  సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.logo