శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 07:53:44

పురానాపూల్‌ బ్రిడ్జి సేఫ్‌

పురానాపూల్‌ బ్రిడ్జి సేఫ్‌

  • పిల్లర్‌ ఊగుతున్నదంటూ సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
  • బ్రిడ్జిపై వాహనాలను నిలిపి.. ఇంజినీరింగ్‌ అధికారుల పరిశీలన
  • రాకపోకలను తిరిగి అనుమతి
  • సందర్శించి పరిశీలించిన ట్రాఫిక్‌ అదనపు డీసీపీ కరుణాకర్‌

చార్మినార్‌/ జియాగూడ : పురానాపూల్‌ బ్రిడ్జి పిల్లర్‌ ప్రమాదకరంగా ఊగుతున్నదంటూ ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. వెంటనే స్పందించిన అధికారులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ట్రాఫిక్‌ అదనపు డీసీపీ కరుణాకర్‌, గోషామహల్‌ ట్రాఫిక్‌ ఏసీపీ రామలింగరాజు, గోషామహల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వర్‌ బ్రిడ్జిని పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులకు సమాచారం అందించగా ఎస్‌ఈ దత్తుపథ్‌, డీఈ ఫైజల్‌, ఏఈ శ్రీనివాస్‌ వచ్చి బ్రిడ్జి పిల్లర్లను పరిశీలించి, అంతా బాగానే ఉన్నట్లు నిర్ధారించారు. దాంతో భారీ వాహనాలు తప్ప అన్ని వాహనాలను తిరిగి అనుమతించారు.