శనివారం 24 అక్టోబర్ 2020
Hyderabad - Sep 23, 2020 , 00:38:47

ప్రజా శ్రేయస్సే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

ప్రజా శ్రేయస్సే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌

వెంగళరావునగర్‌: ప్రజా శ్రేయస్సే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. మంగళవారం యూసుఫ్‌గూడ హనుమంతరావు ఫంక్షన్‌హాల్‌లో పేదలకు ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ హాజరై మాట్లాడారు. ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజవర్గంలో ప్రతి కాలనీ,  బస్తీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఆదర్శనియోజవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం రక్తదానం చేసిన వలంటీర్లకు రెడ్‌క్రాస్‌ తరపున సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షురాలు దేదీప్యరావు, జీటీఎస్‌ ఆలయ చైర్మన్‌ బోడ రాంచందర్‌, నాయకుడు వేణుగోపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
logo