బుధవారం 21 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 06:39:50

మౌలిక వసతుల కోసం నిధులు ఇవ్వండి.. మంత్రి కేటీఆర్‌ను కోరిన కార్పొరేటర్లు

మౌలిక వసతుల కోసం  నిధులు ఇవ్వండి.. మంత్రి కేటీఆర్‌ను కోరిన కార్పొరేటర్లు

మౌలిక వసతుల కోసం  నిధులు కేటాయించండి

మంత్రి కేటీఆర్‌ను కోరిన కార్పొరేటర్లు ఎడ్ల భాగ్యలక్ష్మి, గరిగంటి శ్రీదేవి,శ్రీనివాస్‌రెడ్డి

ముషీరాబాద్‌/అంబర్‌పేట/చిక్కడపల్లి, సెప్టెంబర్‌ 29: ముషీరాబాద్‌ డివిజన్‌లో పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు కార్పొరేటర్‌ ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్‌ వినతిపత్రం సమర్పించారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ నగర కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆమె డివిజన్‌ సమస్యలను కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్‌లో శిథిలావస్థకు చేరిన పైపులైన్‌ను మార్చి డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంతర్గత రోడ్డు నిర్మాణాలు, కమ్యూనిటీహాళ్లు నిర్మించడానికి నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

నిధులు మంజూరు చేయండి

నల్లకుంట డివిజన్‌ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవి రమేశ్‌ విన్నవించారు. ఈ మేరకు డివిజన్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తయారు చేసిన ప్రతిపాదనలతో కూడిన జాబితాను కేటీఆర్‌కు అందజేశారు. 

డివిజన్‌ సమస్యలపై వినతి

 రాంనగర్‌ డివిజన్‌ పరిధిలో పెండింగ్‌ పనులకు సంబధించిన నిధులు వెంటనే మంజూరు చేయించాలని మంత్రి కేటీఆర్‌ని కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. 

logo