భద్రత, రక్షణపై మహిళల్లో చైతన్యం

హైదరాబాద్ : రాచకొండ షీ టీమ్స్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఉమెన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో భద్రత, రక్షణపై మహిళలను చైతన్యపర్చేందుకు పోలీసు కమిషనరేట్ పరిధిలోని భువనగిరిలో శనివారం సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 25 వరకు పలు ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ సందర్భంగా మహిళల భద్రత అంశంపై వివరించి.. వారు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి.. వాటి ని ఎలా ఎదుర్కోవాలి.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తదితర వివరాలను తెలియజేస్తారు. ఆసక్తిగల వారిని సంఘమిత్రలుగా ఎంచుకుని.. వారి ద్వారా మిగతా మహిళలు, విద్యార్థినులు, యువత, చిన్నారులకు భద్ర త, రక్షణపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఉమెన్స్ ఫోరమ్ సంయుక్త కార్యదర్శి లతారామ్, రాచకొండ షీ టీమ్స్ అదనపు డీసీపీ సలీమా, జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ సెల్ అధికారి పులుగుజ్జు సైదు లు, సంఘమిత్ర నాయకురాలు అర్చన మన్నే, ఉమెన్స్ ఫోరమ్ సభ్యులు రజని, శాలిని, జయశ్రీ, సావిత్రి, భూమిక సంస్థ ప్రతినిధులు మాధవి, సఖి కేంద్రం ప్రతినిధులు భార్గవి, ఎంవీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.