Hyderabad
- Jan 23, 2021 , 05:55:33
VIDEOS
‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం

- సర్కిల్ కార్యాలయాల్లో 24 నుంచి మార్చి 28 వరకు కార్యక్రమం
- సమస్యలుంటే పరిష్కరించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి
- ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం
సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఆస్తి పన్నును ఏ మాత్రం పెంచకుండా అంతర్గత లొసుగులను సరిచేసుకుంటూ మదింపు లేదా ఆస్తులను పన్ను చెల్లింపుల పరిధిలోకి తేవడంతో పాటుగా ఆస్తి పన్ను వివాదాలను పరిష్కరిస్తూ పన్ను మొత్తాన్ని వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి మార్చి 28 వరకు ఆదివారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి ఒంటి గంట వరకు ‘ప్రాపర్టీ ట్సాక్స్' పరిష్కారం నిర్వహిస్తున్నట్ల జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేకరించాల్సిన రూ.1900 కోట్ల ఆస్తిపన్ను లక్ష్యంలో ఇప్పటి వరకు రూ. 1247.27 కోట్లు వసూలు అయ్యాయన్నారు.అన్ని సర్కిళ్లలో..
ఆస్తి పన్నుపై ఫిర్యాదులు, మదింపు, కోర్టు కేసుల పరిష్కారం తదితర అంశాలపైన ఇక నుంచి ప్రతి ఆదివారం నగరంలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొని ఆస్తిపన్ను వివాదాలను పరిష్కరిస్తారన్నారు. ఈ నెల 24, 31, ఫిబ్రవరి 7, 14, 21, 28, మార్చి 7,14,21,28 తేదీలలో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆస్తిపన్ను వివాదాలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారంలో ఆస్తిపన్ను వివాదాలకు సంబంధించిన రివిజన్ పిటిషన్లను పరిష్కరించేందుకు ప్రాధాన్యమివ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు.
తాజావార్తలు
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
MOST READ
TRENDING