సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Sep 29, 2020 , 00:23:46

ఇంటివద్దే ఆస్తి పన్ను చెల్లించవచ్చు

ఇంటివద్దే ఆస్తి పన్ను చెల్లించవచ్చు

ఇంటిగ్రేటెడ్‌ పేమెంట్‌ గేట్‌వేను ప్రారంభించిన బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి

కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని పౌరులు ఇకనుంచి తమ ఇండ్ల వద్దే ఆస్తి పన్ను చెల్లించుకోవచ్చునని బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్‌ పేమెంట్‌ గేట్‌వేను సోమవారం సీఈవో, బ్యాంకు అధికారులు కలిసి బోర్డు కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం హెడ్‌డీఎఫ్‌సీ అధికారులు.. బోర్డుకు సోషల్‌ కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) ప్రాజెక్ట్‌ కింద సుమారు రూ.4 లక్షలకు పైగా విలువజేసే వెయ్యి సెల్ఫ్‌ ఐసోలేషన్‌ కిట్లను అందజేశారు.  కార్యక్రమంలో బోర్డు జాయింట్‌ సీఈవో విజయ్‌కుమార్‌ బాలన్‌నాయర్‌,  వాటర్‌ వర్క్స్‌ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌, హెచ్‌డీఎఫ్‌సీ అధికారులు విశాఖ భాటియా, పవన్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo