e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home హైదరాబాద్‌ ఎన్‌ఆర్‌ఎస్‌సీతో వ్యవసాయ వర్సిటీ ఒప్పందం

ఎన్‌ఆర్‌ఎస్‌సీతో వ్యవసాయ వర్సిటీ ఒప్పందం

వ్యవసాయ యూనివర్సిటీ జూలై 24: తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి, వాతావరణంలో మార్పులు రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే సాధ్యమైందని ప్రొ. జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ప్రవీణ్‌ రావు అన్నారు. శనివారం ఆయన చాంబర్‌లో జరిగిన ప్రొ.జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం , భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్ల( ఎన్‌.ఆర్‌.ఎస్‌ సీ) మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ ఒప్పందంలో రిజిస్ట్రార్‌ డా.ఎస్‌ . సుధీర్‌కుమార్‌, ఎన్‌ఆర్‌ఎస్‌సీహైదరాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డా.వి.వెంకటేశ్వరరావు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాన్ని పరిశోధనా సంచాలకులు డా. జగదీశ్వర్‌, వెంకటేశ్వర్లు పరస్పరం పత్రాలు అందజేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం హరితహారం వల్ల వర్షాలు బాగా కురవడంతో భూగర్భ జలాల పెరిగాయన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana