మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 20, 2020 , 01:27:07

‘ప్రైవేట్‌ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

‘ప్రైవేట్‌ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

మంత్రికి ప్రైవేట్‌ రవాణా కార్మికుల ఐక్యవేదిక వినతి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ప్రైవేట్‌ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్‌ ఫైనాన్సర్ల దోపిడీకి అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రైవేట్‌ రవాణా కార్మిక సంఘాల ఐక్యవేదిక సభ్యులు మంత్రి మల్లారెడ్డిని బోయినిపల్లిలోని ఆయన నివాసంలో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. వాహనాల కొనుగోలుకు బ్యాంకు ద్వారా ముద్రా యోజనలో భాగంగా రుణాలు ఇప్పించాలని విన్నవించారు.కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రవిశంకర్‌, మారయ్య, మల్లేశ్‌గౌడ్‌, సత్తిరెడ్డి,సీహెచ్‌.సాయిలు, లిఖిత్‌కుమార్‌,పెంటయ్యగౌడ్‌, శ్రీను, కృష్ణమూర్తి, మహేశ్‌, ఎండీ. హాబీబ్‌, ఎస్‌.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 


logo