రూ.75వేలకు.. రూ.2లక్షలు చెల్లించాడు

- అయినా వేధింపులు.. ఈ నెల 2న ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య
- ముగ్గురు రుణయాప్ నిందితులు అరెస్ట్
జీడిమెట్ల : ఆన్లైన్ రుణయాప్‌లో అప్పులు ఇచ్చి.. అధిక వసూళ్లకు పాల్పడటంతోపాటు వేధింపులకు గురిచేసి ఒకరి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురిని పేట్‌బషీరాబాద్, బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్(35) ప్రైవేటు ఉద్యోగి.. గత యేడాది పాన్బాన్, క్యాష్ప్మ్యాప్, రెడ్ కార్ప్, రూఫీప్లస్, క్యాష్గో, క్యాష్షీడ్ ఆన్లైన్ యాప్‌ల్లో రూ.75వేలు రుణం తీసుకున్నాడు. డిసెంబర్ 2020 నాటికీ రూ.2లక్షల వరకు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు చెల్లించాలంటూ ఎస్ఎంఎస్, ఫోన్ల ద్వారా వేధింపులకు పాల్పడుతుండటంతో ఈనెల 2న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పేట్‌బషీరాబాద్ సీఐ రమేశ్ బృందం, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి బృందం కేసు విచారణ చేపట్టి.. నిందితులు ముగ్గురు ఢిల్లీ, బెంగళూల్లో ఉన్నట్లు గుర్తించారు. హర్యానాకు చెందిన ప్లాష్క్యాష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ హేమంత్‌కుమార్ ఝా(28), బెంగళూరులోని జస్ఐటీ టెక్నాలజీస్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ వి.మంజునాథ్(28), అదే ప్రాంతానికి చెందిన టీజీహెచ్వై ట్రస్ట్ రాక్కంపెనీ మేనేజర్ అబ్దుల్లాక్(25)ను ఢిల్లీలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని.. ఏడు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.65లక్షలను ఫ్రీజ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు, ఆరుగురు దుర్మరణం
- ' ఉప్పెన' మేకింగ్ వీడియో చూడాల్సిందే
- మతిస్థిమితం లేని వ్యక్తిని.. కుటుంబంతో కలిపిన ఒక పదం
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి !!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49