శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Sep 07, 2020 , 01:46:26

అసత్య ప్రచారాన్ని అడ్డుకోండి

అసత్య ప్రచారాన్ని అడ్డుకోండి

  లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న చైల్డ్‌ కేర్‌ ఇనిస్టిట్యూట్స్‌ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని జూవైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయడం ద్వారా ఆయా సంస్థలకు రక్షణ కల్పించాలని ‘చిల్డ్రన్‌ ఆర్గనైజేషన్‌ ఫెడరేషన్‌' (సీఓఎఫ్‌) ప్రతినిధులు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కోరారు. నిస్వార్థంగా పనిచేస్తున్న తమ సంస్థలపై కొందరు కావాలనే బురద చల్లుతున్నారని మంత్రితో పాటు ఆ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో  సీఓఎఫ్‌ ప్రతినిధులు రాఘవేంద్ర, నవీన్‌ కుమార్‌ , అనిల్‌ కుమార్‌, నూతన్‌, సాంబశివరావు, శ్రీవియల్‌, మాధవి పాల్గొన్నారు.   -    అహ్మద్‌నగర్‌