మంగళవారం 26 మే 2020
Hyderabad - May 24, 2020 , 02:53:41

హరితహారం కార్యక్రమానికి కోటి మొక్కలు సిద్ధం

హరితహారం కార్యక్రమానికి కోటి మొక్కలు సిద్ధం

హైదరాబాద్  : ఈ ఏడాది హరితహారం కార్యక్రమానికి కోటి మొక్కలు సిద్ధం చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తెలిపారు.  ఉదయం తెల్లాపూర్‌లోని 150 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ నర్సరీని అధికారులతో కలిసి సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధంగా ఉన్న వివిధ రకాల మొక్కలు, వాటి ఎదుగుదలను పరిశీలించారు.

 జిల్లాల నుంచి వచ్చే ప్లాంటేషన్‌ ఆర్డర్లకు అనుగుణంగా మొక్కలను అందజేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సారి సుమారు 500 ఖాళీ స్థలాల్లో ట్రీ పార్కులను అభివృద్ధి చేసే బాధ్యతను అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగానికి అప్పగించారు. ఈ సందర్భంగా గతేడాది ఆగస్టు 28న తెల్లాపూర్‌ నర్సరీలో తాను నాటిన మొక్క (మర్రి) ఎదుగుదలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో  అర్బన్‌ ఫారెస్ట్రీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఐ. ప్రకాశ్‌, ఫారెస్ట్‌ మేనేజర్‌ సి. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.logo