శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 24, 2020 , 02:32:29

25, 26 తేదీల్లో వానలు కురిసే అవకాశం

25, 26 తేదీల్లో వానలు కురిసే అవకాశం

హైదరాబాద్ : ఎండతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఈ కారణంగా 25, 26న గ్రేటర్‌లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాగా, నగరంలో భానుడు భగభగమంటున్నాడు. దీనికితోడు వడగాలుల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు గరిష్ఠంగా  42.8, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 14 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. logo