శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 16, 2020 , 08:57:04

పాలిసెట్ ప్రక్రియ ప్రారంభం..

పాలిసెట్ ప్రక్రియ ప్రారంభం..

హైదరాబాద్ ‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న పాలిసెట్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన పాలిసెట్‌ నోటిఫికేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 2 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్‌ 4 వరకు పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. పాలిసెట్‌ పరీక్షల నిర్వహణకు కో-ఆర్డినేషన్‌ సెంటర్‌గా ఉన్న మాసబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల పరిధిలో 4550 సీట్ల భర్తీకి నగరంలోని 9 సెంటర్లలో ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తరువాత ఏప్రిల్‌ 6 వరకు రెండు రోజులపాటు అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్‌ 17 న పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాధారణ ఎంట్రెన్స్‌ రుసుముగా రూ.400,  ఎస్సీ,ఎస్టీలకు రూ.250  డీడీ చెల్లించాల్సి ఉంటుంది.     

ఉర్దూ మీడియంలోనూ...

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు ఉర్దూ మాద్యమంలో కొనసాగుతున్న మాసబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ కాలేజీలో 7 బ్రాంచ్‌లు కొనసాగుతున్నాయి. పదవ తరగతి అర్హతతో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఆధునిక సాంకేతిక విద్య అందుతుండడంతో పాలిటెక్నిక్‌ సీట్లకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. కళాశాలకు అనుబంధంగా విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహ సౌకర్యాలు సైతం కల్పిస్తున్నారు. 


logo