e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home హైదరాబాద్‌ మీ లొకేషన్‌కే తీసుకొస్తాం.. వెబ్‌సైట్‌లో ప్రకటనలు

మీ లొకేషన్‌కే తీసుకొస్తాం.. వెబ్‌సైట్‌లో ప్రకటనలు

మీ లొకేషన్‌కే తీసుకొస్తాం.. వెబ్‌సైట్‌లో ప్రకటనలు
  • పోలీసుల డెకాయ్‌ ఆపరేషన్‌.. 
  • వ్యభిచార నిర్వాహకుడు అరెస్ట్‌

జస్ట్‌ మీ లొకేషన్‌ను వాట్సాప్‌లో పెట్టండి… అమ్మాయిలతో మీ ముందు ఉం టాం.. ఇది ఇప్పుడు తాజా వ్యభిచార నిర్వాహకుల హైటెక్‌ సర్వీస్‌. ఈ సేవల గురించి ఓ వెబ్‌సైట్‌లో పెట్టడంతో రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టి ఇద్దరు యువతులను కాపాడి నిర్వాహకుడిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా జిల్లా కనికిపాడు మండలం, ఎడుపుగుల్ల గ్రామానికి చెందిన వంశీకృష్ణ ఎస్‌ఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఓ వెబ్‌సైట్‌లో మా వద్ద కాల్‌గర్ల్స్‌ ఉన్నారని, వారు ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాలకు చెందిన యువతులు, మహిళలు అని ప్రకటన వేసి.. అవసరం ఉన్నవారు సంప్రదించాలని అతడు తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. కేవలం మీ లొకేషన్‌ పంపిస్తే.. మీ వద్దకే యువతులను తీసుకువస్తానని పెట్టాడు. ఈ ప్రకటనను పరిశీలించిన పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి నిర్వాహకుడికి ఫోన్‌ చేశారు. అతను లొకేషన్‌ పంపించండి.. అమ్మాయిలను తీసుకువస్తామని చెప్పాడు. దీంతో కుషాయిగూడ ప్రాంతం లొకేషన్‌ ఇచ్చిన పోలీసులు.. వంశీకృష్ణ అసోం, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతానికి చెందిన యువతులను తీసుకువచ్చాడు.  వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణను అరెస్ట్‌చేసి.. యువతులను పునరావాస కేంద్రానికి పంపించారు. ఈ వెబ్‌సైట్‌ను తిలకించే వారిని ఆకట్టుకునేందుకు యువతుల అర్ధనగ్న ఫొటోలు పెట్టి దందాను జోరుగా నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌ను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కుషాయిగూడ పోలీసులు సంయుక్తంగా చేపట్టి అక్రమ దందాను బయటపెట్టారు. 

Advertisement
మీ లొకేషన్‌కే తీసుకొస్తాం.. వెబ్‌సైట్‌లో ప్రకటనలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement