గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:44:01

ఆహ్లాదం @ అర్బన్‌ ఫారె స్టీ

ఆహ్లాదం @ అర్బన్‌ ఫారె స్టీ

16 చోట్ల అర్బన్‌ ఫారెస్ట్రీ బ్లాక్‌లకు హెచ్‌ఎండీఏ శ్రీకారం 

ఔటర్‌ చుట్టూ సిద్ధమవుతున్న ఆక్సిజన్‌ పార్కులు

తుది దశలో ఉద్యాన వనాల పనులు.. విడుతల వారీగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారుల చర్యలు 


పొదలు, చెత్తాచెదారంతో కళావిహీనంగా మారిన రిజర్వ్‌ ఫారెస్ట్‌లు ఇక ప్రకృతి రమణీయతతో అలరించనున్నాయి. అటవీ ప్రాంతాలే అర్బన్‌ లంగ్‌ స్పేస్‌లుగా మారుతున్నాయి. ఇక మీదట ఉదయం, సాయంత్రం వేళ అక్కడ పచ్చని అందాలు.. పక్షుల కిలకిలరావాలు పలుకరించనున్నాయి. అంతేకాక ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ 16 చోట్ల ఆక్సిజన్‌ పార్కులు భాగ్యనగర వాసులను రా రమ్మనేలా ముస్తాబవుతున్నాయి. తుదిదశలో ఉన్న అర్బన్‌ ఫారెస్ట్రీ బ్లాక్‌ పనులను పూర్తి చేసి విడుతల వారీగా అందుబాటులోకి తేనున్నామని హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు తెలిపారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

ఓ వైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్య తీవ్రత.. మరోవైపు మానసిక ఒత్తిడి.. వెరసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్స్‌కు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చే చర్యల్లో భాగంగా  హెచ్‌ఎండీఏ  పరిధిలో 16 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో రూ.96.64 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఇంటెన్వీవ్‌ పద్ధతిలో లక్షలాది మొక్కలను నాటారు. కిలోమీటర్ల మేర చుట్టూ ప్రహరీ, కనువిందు చేసే ప్రవేశ ద్వారం పనులను పూర్తి చేశారు.

ఎన్నో ప్రత్యేకతలు.. 

ఆహ్లాదానికి నిలయంగా ఏర్పాటు చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్రీ బ్లాక్‌ల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పార్కుకు వెళ్లిన ప్రతిఒక్కరూ సేద తీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాకింగ్‌ పాత్‌వేలు, సైక్లింగ్‌ ట్రాక్‌లు, చిన్నారుల కోసం చిల్డ్రన్‌కార్నర్‌లను అందుబాటులోకి తేనున్నారు. అటవీ అందాలను తిలకించేలా వాచ్‌టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక యోగా సెంటర్లు, భారీ వృక్షాల కింద కూర్చోవడానికి వీలుగా రచ్చబండలు, వాష్‌రూంలు, గజేబో(గుడిసె)లను సిద్ధం చేస్తున్నారు. సెక్యూరిటీ రూం, టికెట్‌ కౌంటర్లను నిర్మిస్తున్నారు.

నవంబర్‌లో అందుబాటులోకి వచ్చే పార్కులు: శ్రీనగర్‌/పడమటి కంచ, సిరిగిరిపూర్‌, మనోహరాబాద్‌, కమ్మదనం, పల్లెగడ్డ, నాగారం, బాచారం, జలాల్‌పూర్‌ 

డిసెంబర్‌లో అందుబాటులోకి వచ్చే పార్కులు: వడియారం, అంబర్‌పేట కలాన్‌, పరికిబండ, బీబీనగర్‌, కొండమడుగు, సంగారెడ్డి, తుర్కపల్లి, మన్నె కంచ

వచ్చే నెలాఖరు నాటికి

పెండింగ్‌ పనులను

పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు 

అధికారులు తెలిపారు.

అర్బన్‌ ఫారెస్ట్రీ బ్లాక్‌ పనుల వివరాలు..

బాచారం క్లస్టర్‌ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం బాచారం

ఖర్చు 292.91లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 70.90 హెక్టార్లు 

నాటిన మొక్కలు 9000


పురోగతిలో ఉన్న పనులు

పని టార్గెట్‌ పూర్తి చేసినవి 

ప్రహరీ నిర్మాణం 210.70కి.మీ 139.25కి.మీ

ప్రవేశ ద్వారం 16 చోట్ల 16 

పాత్‌వేలు 48.40 కి.మీ 29.80

గజుబోలు 16 10

వాచ్‌టవర్స్‌ 16 0

వాష్‌రూమ్‌ 16 0


అంబర్‌పేట కలాన్‌ క్లస్టర్‌ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం అంబర్‌పేట కలాన్‌  

ఖర్చు 871.65లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 437.25 హెక్టార్లు 

నాటిన మొక్కలు 55,000

కొండమడుగు ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం కొండమడుగు

ఖర్చు 541.91లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 115.80 హెక్టార్లు 

నాటిన మొక్కలు 10,000


జలాల్‌పూర్‌ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం జలాల్‌పూర్‌

ఖర్చు 827.05లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 301.90 హెక్టార్లు 

నాటిన మొక్కలు 11400


బీబీనగర్‌ ఆర్‌ఎఫ్‌

ప్రాంతం బీబీ నగర్‌ 

ఖర్చు 376.86లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 104.31 హెక్టార్లు 

నాటిన మొక్కలు 9500

శ్రీనగర్‌/పడమటికంచ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం శ్రీనగర్‌/పడమటికంచ

ఖర్చు 1021.88లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 526.91 హెక్టార్లు 

నాటిన మొక్కలు 23000


సిరిగిరిపూర్‌  ఆర్‌ఎఫ్‌

ప్రాంతం సిరిగిరిపూర్‌ 

ఖర్చు 342.13 లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 102.39 హెక్టార్లు 

నాటిన మొక్కలు 29,300

పల్లెగడ్డ  ఆర్‌ఎఫ్‌

ప్రాంతం పల్లెగడ్డ

ఖర్చు 289.49 లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 87.41 హెక్టార్లు 

నాటిన మొక్కలు 32500


మన్యంకంచ ఆర్‌ఎఫ్‌

ప్రాంతం మన్యంకంచ

ఖర్చు 319.55లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 58.78 హెక్టార్లు 

నాటిన మొక్కలు 32500 


నాగారం క్లస్టర్‌ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం నాగారం  

ఖర్చు 740.46లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 556.69 హెక్టార్లు 

నాటిన మొక్కలు 40,000


వడియారం క్లస్టర్‌ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం వడియారం

ఖర్చు 848.52లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 465.17 హెక్టార్లు 

నాటిన మొక్కలు 18200

మనోహరాబాద్‌ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం మనోహరాబాద్‌

ఖర్చు 575.05లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 129.00 హెక్టార్లు 

నాటిన మొక్కలు 38000


పరికిబండ ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం పరికిబండ

ఖర్చు 1737.25లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 880.14 హెక్టార్లు 

నాటిన మొక్కలు 30,300


తుర్కపల్లి ఆర్‌ఎఫ్‌ 

ప్రాంతం తుర్కపల్లి

ఖర్చు 294.12లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 54.92 హెక్టార్లు 

నాటిన మొక్కలు 24500


సంగారెడ్డి క్లస్టర్‌ ఆర్‌ఎఫ్‌

ప్రాంతం సంగారెడ్డి

ఖర్చు 1924.34 లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 1757.57 హెక్టార్లు 

నాటిన మొక్కలు 31200

కమ్మదనం ఆర్‌ఎఫ్‌

ప్రాంతం కమ్మదనం 

ఖర్చు 659.60 లక్షలు 

రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తీర్ణం 329.82 హెక్టార్లు 

నాటిన మొక్కలు 50, 400 
logo