ఆదివారం 05 జూలై 2020
Hyderabad - Jul 01, 2020 , 00:31:42

అలసిన మనసుకు ఆహ్లాదం

అలసిన మనసుకు ఆహ్లాదం

భోలక్‌పూర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కాలనీ పార్కు

 బషీర్‌బాగ్‌ : అలసిన మనసుకు ఆహ్లాదాన్ని పంచేందుకు నగరంలోని పార్కులు ఎంతగానో దోహదపడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన పార్కులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. భోలక్‌పూర్‌ డివిజన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కాలనీలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కును రూ. 5.50లక్షలతో ఫుట్‌పాత్‌లు, చైన్‌ లింక్‌ మెస్‌(జాలి), కర్బింగ్‌, టైల్స్‌, ఎస్‌డబ్ల్యూ డ్రైన్‌, పార్కుకు రెండు వైపులా గేట్లతో పాటు బోర్‌ను ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు. విద్యుత్‌ దీపాలతో పార్కు కళకళలాడుతుంది.  దీంతో పార్కు ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా దర్శనమిస్తుంది.  ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పార్కును ఆధునీకరించి బస్తీ, కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా మూసి ఉంచిన పార్కులో ఆకతాయిలు ప్రవేశించకుండా వాచ్‌మన్‌ బాలయ్య సంరక్షిస్తున్నాడు.


logo