e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home హైదరాబాద్‌ విశ్వాస జీవులు.. ఆత్మీయ నేస్తాలు..!

విశ్వాస జీవులు.. ఆత్మీయ నేస్తాలు..!

  • గ్రేటర్‌లో సుమారు 2 లక్షల వరకు పెంపుడు జంతువులు
  • నగరంలో పెరుగుతున్న పెట్స్‌ లవర్స్‌
  • ఫ్యామిలీల్లో ఒకటిగా మూగజీవాలతో సాన్నిహిత్యం
  • అవి లేకుండా ఉండలేకపోతున్న జంతుప్రేమికులు

ఇటీవల పిల్లి కనిపించకపోతే కన్నీరుపెట్టిన ఓ మహిళ వెతికిపెట్టాలంటూ.. రివార్డు ప్రకటన
కిలకిల రావాలు చేసే పక్షులు.. నీళ్లల్లో తేలుతూ..అటూ..ఇటూ తిరుగుతూ కనువిందు చేసే చేపలు.. ఆత్మీయంగా పలకరించే చిలుకలు.. మియాం..మియాం.. అంటూ సందడి చేసే పిల్లులు.. అమితమైన ప్రేమ కురిపించే శునకాలు ఇలా ఏ మూగజీవాలైనా సరే.. వాటిని మనసారా ప్రేమిస్తే చాలు.. విశ్వాసం చివరి వరకు చూపిస్తాయి. అందుకే పెంపుడు జంతువులంటే ఇష్టపడని వారుండరు. ఫ్యామిలీలో ఒకటిగా భావిస్తారు. వాటితో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకుంటారు. ఇటీవల నగరంలో ఓ మహిళా తన పిల్లి తప్పిపోయిందని కన్నీరుపెట్టుకున్నది. వెతికిపెడితే రూ.30 వేలు ఇస్తానని ప్రకటించింది. ఈ సంఘటన పెంపుడు జంతువులపై పెంచుకుంటున్న అనుబంధాన్ని సూచిస్తున్నది.

నగరంలో పెట్స్‌ ప్రేమికులు పెరుగుతున్నారు. చాలా మంది ఇండ్లల్లో ఏదో ఒక పెట్‌ కనిపిస్తున్నది. అనటోలియన్‌ షెఫర్డ్‌ డాగ్స్‌ బుల్‌మాస్టిఫ్‌, డోగో అర్జెంటినో, మస్టాఫ్‌, జర్మన్‌ షెఫర్డ్‌ డాగ్స్‌ జర్మన్‌ షెఫర్డ్‌ తదితర జాతుల శునకాలు నగరవాసుల గృహాల్లో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు మెయిన్‌కూన్‌, బెంగాల్‌, బ్రిటీష్‌ షాట్‌హెయిర్‌, సైబేరియన్స్‌, ఇండిమౌ తదితర జాతి పిల్లులు కూడా ఉన్నాయి. ఎక్కువగా లక్షల రూపాయలు ధర పలికే ఈ పెంపుడు జంతువులు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇండ్లల్లో దర్శనమిస్తాయి. వాటి సంరక్షణకు కావాల్సిన ఉత్పత్తులను పెట్‌ కేర్‌ కంపెనీలు కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నాయి.

దేశంలో సుమారు 2.5 కోట్లు..

- Advertisement -

దేశంలో సుమారు 2.5 కోట్ల పెంపుడు జంతువులు ఉన్నాయి. అందులో 1.80 కోట్ల శునకాలు ఉన్నాయని పెట్‌ ఫుడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ సాకిబ్‌ పతాన్‌ తెలిపారు. నగరంలో సుమారు 40వేల నుంచి 2 లక్షల లోపు పెంపుడు జంతువులు ఉన్నాయని వివరించారు. కేవలం పెంపుడు కుక్కల ఫుడ్‌ మార్కెట్‌ దేశంలో రూ.2వేల కోట్ల పైమాటే. ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా సుమారు 4 లక్షల మూగజీవాలను దత్తత తీసుకుంటున్నారని వెల్లడించారు. అవి ైస్టెలీష్‌గా కనిపించేందుకు.. బలంగా ఉండటానికి.. ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్స్‌పర్ట్స్‌ హెయిర్‌ ైస్టెలర్స్‌తో వాటికి అందా న్ని అద్దుతున్నారు. మరోవైపు నగరంలోని కోఠి, హిమాయత్‌నగర్‌, కాచిగూడ, బంజరాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో విభిన్నరకాల పక్షుల, జంతువుల విక్రయ కేంద్రాలు ఉన్నాయి. సంకునూర్‌, మకావో రామ చిలుకలకు భలే డిమాండ్‌ ఉంది. వాటి ధర లక్ష రూపాయల పై మాటే. ఇక చేపలను కూడా ఇంట్లో సాకడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

ఆహారం చాలా ముఖ్యం

శునకాలను పెంచుకోవడమే కాదు.. వాటి ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తే నష్టం. పప్పీ డాగ్స్‌, అడల్ట్‌ డాగ్స్‌కు వే ర్వేరు ఆహారాన్ని అందించాలి. ఎని మిది నెలలలోపు ఉండే పప్పీ డా గ్స్‌కు చికెన్‌ అండ్‌ రైస్‌, అడల్ట్‌ డాగ్స్‌కు మటన్‌ అండ్‌ రైస్‌తో కూడిన పిల్స్‌ అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఒక శునకానికి నెలకు రూ.6 వేల నుంచి 10వేల వరకు ఖర్చు వస్తుం ది. ఇతర జాతి శునకాలకు మెయింటెనెన్స్‌ లక్ష వరకు అవుతుంది.- సాకిబ్‌, పెట్‌ఫుడ్‌ డిస్ట్రిబ్యూటర్‌

విశ్వాసం చూపించడంలో..

మేము మా ఇంట్లో పప్పీ డాగ్‌ను పెంచుకుంటున్నాం. ఇంట్లో ఎవ్వరూ లేకున్నా.. అది ఉంటే చాలు మాకెంతో ధైర్యంగా అనిపిస్తుంది. మా కుటుంబ సభ్యుల కంటే అదే ఎక్కువగా మారింది. పిల్లిని కూడా పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాం. వైద్యుల సూచన మేరకు వ్యాక్సిన్‌ వేయిస్తున్నాం. – ప్రణీత, పెట్‌ ప్రేమికురాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana