శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 08:36:33

రోడ్డు దాటుతుండగా.. ఢీకొన్న లారీ వ్యక్తి మృతి..

రోడ్డు దాటుతుండగా.. ఢీకొన్న లారీ వ్యక్తి మృతి..

 మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా ఘటన

మేడ్చల్‌ : దసరా రోజే.. ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం... మల్కాజిగిరికి చెందిన నరేందర్‌ (43).. మేడ్చల్‌లోని అత్తగారింట్లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మార్కెట్‌కు వెళ్లి.. స్థానిక వివేకానంద విగ్రహం ఎదురుగా 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్‌ పట్టణంలోని ప్ర భుత్వ దవాఖానలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.