మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 04, 2020 , 00:43:04

6 నుంచి ‘గోల్కొండ’లో అనుమతి

6 నుంచి ‘గోల్కొండ’లో అనుమతి

ప్రతి రోజూ 2000 మంది  సందర్శకులకే..  

ఆన్‌లైన్‌లో టికెట్లు

మెహిదీపట్నం: చారిత్రక  గోల్కొండ కోటలో సోమవారం నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం అంతర్గత  సమావేశం  నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ కేవలం 2000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని గోల్కొండ కోట పర్యవేక్షణాధికారి నవీన్‌ తెలిపారు. కొవిడ్‌ -19 నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అదే విధంగా తినుబండారాలను అనుమతించబోమని, క్యాంటీన్‌లో మంచినీరు మాత్రమే అమ్ముతామన్నారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కోటను తెరిచి ఉంచుతామని, సందర్శకులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. 


logo