మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 06, 2020 , 00:24:05

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

- ప్రభుత్వ విప్‌ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యె అరెకపూడి గాంధీ

 హైదర్‌నగర్‌ :  శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల మధ్య రాకపోకలు అధికంగా సాగించే ఉషాముళ్లపూడి దారి అత్యంత ప్రధానమైనదని,  ఈ దారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతున్నదని ప్రభుత్వ విప్‌ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యె అరెకపూడి గాంధీ అన్నారు. నిత్యం వేలాది వాహనాలు సంచరించే కీలకమైన ఉషాముళ్లపూడి దారి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆయన ఆదేశించారు. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధి ఆల్విన్‌కాలనీ డివిజన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులపై కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌, సర్కిల్‌ అధికారులతో ఎమ్మెల్యే గాంధీ వివేకానందనగర్‌లోని తన నివాసంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్విన్‌ కాలనీ డివిజన్‌లో 50 శాతానికి పైగా మురికివాడలున్నాయని, ఈ డివిజన్‌ను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు గాను మంజూరై పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్మశాన వాటిక అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆల్విన్‌కాలనీ డివిజన్‌ అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటు ఉంటుందని భరోసా ఇచ్చారు. డీఈ గోవర్దన్‌, ఏఈ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.


logo