శుక్రవారం 22 జనవరి 2021
Hyderabad - Nov 29, 2020 , 06:43:50

గొలుసు దొంగలపై పీడీయాక్ట్‌

గొలుసు దొంగలపై పీడీయాక్ట్‌

హైదరాబాద్‌ : గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలపై  రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పీడీ యాక్ట్‌ను విధించారు. హయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రాపాని వెంకటేశ్‌, ముచ్చ వంశీకృష్ణ, వరికుప్పల ప్రకాశ్‌ పదో తరగతి వరకు చదివారు. విలాసాలకు అలవాటు పడి చదువు మధ్యలో ఆపేసి ప్రైవేటు పనులు చేస్తున్నారు. విలాసాలకు డబ్బు సరిపోకపోవడంతో 2019లో 11 గొలుసు దొంగతనాలకు పాల్పడి శివారు ప్రాంతాల్లో భయాందోళన సృష్టించారు. మీర్‌పేట్‌ పోలీసులు ఆగస్టులో నిందితులను అరెస్టు చేసి 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రవర్తనా తీరు సరిగాలేని వెంకటేశ్‌, ప్రకాశ్‌పై సీపీ పీడీ యాక్ట్‌ను విధించి, ఏడాదిపాటు జైలులో ఉండేలా చర్యలు చేపట్టారు.


logo