ఆదివారం 12 జూలై 2020
Hyderabad - Jun 04, 2020 , 02:08:00

కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం

కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం

బడంగ్‌పేట : సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ పరిధిలోని అల్మాస్‌గూడ 1, 2 వార్డులలో, మల్లాపూర్‌ 14 వార్డులో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. 20వ వార్డులో కార్పొరేటర్‌ పెద్ద బావి సుదర్శన్‌రెడ్డి శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో  నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం పది గంటల పదినిమిషాలకు శానిటేషన్‌ పనులు ఎవరి ఇంట్లో వారు చేసుకోవాలన్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కమిషనర్‌ సత్యబాబు, డీఈ అశోక్‌రెడ్డి, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వంకాయల యాదగిరి , చప్పిడి సంతోష్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, కుంచ నాగేందర్‌గౌడ్‌,  కార్పొరేటర్‌ జనిగ పద్మ ఐలయ్య తదితరులు ఉన్నారు. 

మణికొండ:  నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, నార్సింగి తదితర గ్రామాల్లో బుధవారం పరిసరాల పరిశుభ్రత, రోడ్లపై నిల్వ ఉన్న నీరు,  మురికికాలువల్లోని వ్యర్థాలతోపాటు పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ రేఖ, ఆయా వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ కె.నరేందర్‌రెడ్డి పరిశీలించారు. వార్డుల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్తవేస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఖాళీ ప్లాట్లలో చెత్తను తొలిగించడం, ఆ స్థలాల్లో ఎవరైనా చెత్త వేస్తే రూ.20వేల జరిమానా విధిస్తామన్నారు.  

శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాలను బుధవారం చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి పరిశీలించారు. ఆమె ఆధ్వర్యంలో వైస్‌ చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌, కమిషనర్‌ సాబేర్‌ అలీ, వార్డు కౌన్సిలర్లు పర్యటించారు.  ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ శంషాబాద్‌ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న  పారిశుధ్య ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు.  

చినగొల్లపల్లిలో కౌన్సిలర్‌ చెన్నం అశోక్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. చెట్లపొదలు తొలగించడంతోపాటు మురుగు లేకుండా శుద్ధి చేయించారు. 

ఇందిరమ్మకాలనీ, రాజీవ్‌గృహకల్ప కాలనీల్లో వైస్‌ చైర్మన్‌గోపాల్‌యాదవ్‌ పర్యటించారు. నివాసాలపై నిరుపయోగ వస్తువులను తొలిగించారు. మురుగునీటిని ఊడ్చేసి శుభ్రం చేశారు. 

కందుకూరు : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతులుగా జీవిస్తారని రంగారెడ్డి జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు.  మండల పరిధిలోని లేమూరు, సరస్వతిగూడ గ్రామాలలో బుధవారం ఎంపీడీఓ కృష్ణకుమారితో కలిసి గ్రామాల్లో పర్యటించి, మురుగునీటి కాల్వలు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులను, నర్సరీలను  పరిశీలించారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కృష్ణకుమారి, పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గొపిరెడ్డి విజేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు పరంజ్యోతి, రాము, ఎంపీటీసీ మంచాల యాదయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సత్యనారాయణరెడ్డి, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.


logo