శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 23, 2020 , 03:05:53

క్వారంటైన్‌ పూర్తయ్యే వరకు పాస్‌పోర్టులు సీజ్‌

క్వారంటైన్‌ పూర్తయ్యే వరకు పాస్‌పోర్టులు సీజ్‌

మల్కాజిగిరి : విదేశాల నుంచి వచ్చిన వారి పాస్‌పోర్ట్‌ లను సీజ్‌ చేసిన అధికారులు తిరిగి ఇచ్చేస్తున్నారు. కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ఉన్నతాధికారుల నివేదిక ప్రకారం వారి వద్దకు నేరుగా వెళ్లిన రెవెన్యూ అధికారులు పాస్‌పోర్ట్‌లను సీజ్‌ చేసిన విషయం విదితమే. అంతేగాకుండా స్వీయ నిర్బంధంలో ఉంచేందుకు పాస్‌పోర్ట్‌ పత్రాలను సీజ్‌ చేసి 15 రోజుల తర్వాత తిరిగి అందజేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన 520 మంది విదేశాల నుంచి వచ్చారు. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో 402, అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో 118 మందికి చెందిన పాస్‌పోర్ట్‌లను సీజ్‌ చేశారు. స్వీయ నిర్బంధం పూర్తి కావడంతో ఏప్రిల్‌ 21 నుంచి పాస్‌పోర్ట్‌ పత్రాలు కావాల్సిన వారు తీసుకెళ్తున్నట్లు మల్కాజిగిరి మండల తహసీల్దార్‌ గీత తెలిపా రు. కాగా విదేశాల నుంచి వచ్చి స్వీయ నిర్బంధంలో ఉన్న వారందరికీ ప్రతిరోజు వైద్య సిబ్బంది సేవ లందిచారు. 

పాస్‌పోర్ట్‌ల అప్పగింత..

సీజ్‌ చేసిన పాస్‌పోర్ట్‌లను ఇప్ప టి వరకు 317 మందికి అందజేశారు. ఆయా ప్రాంతాలకు చెందిన మరో 203 మందికి పత్రాలు ఇవ్వాల్సి ఉంది. సీజ్‌ చేసిన సమయంలో ఇచ్చిన రసీదు తీసుకుని పాస్‌పోర్ట్‌లను తిరిగి ఇస్తున్నారు. అయితే మిగిలిన వారి పత్రాలను తహసీల్దార్‌ కార్యాలయాల్లో జాగ్రత్తగా భద్రపరిచారు. 


logo