మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 27, 2021 , 05:40:35

ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్‌...

ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్‌...

మన్సూరాబాద్‌,  : ఎల్బీనగర్‌, నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం సాయంత్రం పద్మమోహన ఆర్ట్స్‌ 30వ వార్షికోత్సవ వేడుకలతో పాటు టీవీ ఆర్టిస్టులకు అందజేసే అవార్డుల 10వ వార్షికోత్సవ వేడుకలు టీవీ అవార్డ్స్‌ -2020 కన్నుల పండువగా జరిగాయి. కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు సుమన్‌, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొల్లేటి దామోదర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పద్మమోహన ఆర్ట్స్‌ ఫౌండర్‌, చైర్మన్‌ డీపల్లె యాదగిరి గౌడ్‌తో కలిసి హీరో సుమన్‌, తెలంగాణ పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. టీవీ నటీనటులు, యాంకర్స్‌, జర్నలిస్టులతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సుమారు 60 మందికి టీవీ అవార్డ్స్‌ను అందజేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు పద్మమోహన లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు. అదే విధంగా టీవీ ఆర్టిస్ట్‌ శ్రుతి, మధుసూదన్‌ దంపతులకు విశిష్ట దంపతుల అవార్డును ప్రదానం చేశారు. తెలుగు బిగ్‌బాస్‌-4 రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ పద్మమోహనా అవార్డును అందుకున్నారు. అదే విధంగా రమణ్‌, వర్ష విశ్వనాథ్‌లు నాయక నాయికలుగా నటించే నూతన చిత్రం ‘రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం’ మోషన్‌ పిక్చర్‌ను సుమన్‌, దామోదర్‌లు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు విజయ్‌ కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస రాజు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo