శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 06:47:52

ఆస్తి, వాహన నష్టాల అంచనాకు ప్రత్యేక విభాగం

ఆస్తి, వాహన నష్టాల అంచనాకు ప్రత్యేక విభాగం

ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ వెల్లడి

అమీర్‌పేట్‌: ఇటీవల కురిసిన వర్షాలకు అపార్ట్‌మెంట్స్‌ సెల్లార్లు లేదా వరదల్లో కొట్టుకుపోయిన పాలసీదారులకు చెందిన ఆస్తి, వాహనాల నష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేక దావా విభాగాన్ని ఏర్పాటు చేశామని ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వరద నష్టానికి సంబంధించిన దావాలన్నింటిని డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రాపాక జయసూర్య పర్యవేక్షిస్తారని, జరిగిన వాహన, ఆస్తి నష్టానికి సంబంధించి పాలసీదారులకు సలహాలు సూచనలు, అనుమానాలేమైనా ఉంటే నివృత్తి చేసుకునేందుకు తమ సిబ్బంది కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. వాహన, ఆస్తి నష్టానికి సంబంధించి పాలసీదారులు వెంటనే దావా సిబ్బంది దృష్టికి తీసుకువస్తే వారు టోవింగ్‌ ఏజెన్సీ ద్వారా జరిగిన నష్టాన్ని అతి తక్కువ సమయంలో అంచనా వేసి వారి దావా పరిష్కరించే ప్రయత్నం చేస్తారని తెలిపారు. ఆస్తి నష్టాలకు సంబంధించిన సలహాలు సూచనలకు డిప్యూటీ మేనేజర్‌ సంధ్యా జగన్నాథన్‌ (92472 43298), వాహన నష్టాలకు సంబంధించిన అంశాలపై సలహాలు, సూచనలకు మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌ (98491 24496)లను స్రంపదించాలని అధికారులు కోరుతున్నారు.