సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 07:05:35

రైల్వే స్టేషన్లలో..సేంద్రియ వ్యర్థ కంపోస్టింగ్‌ ప్లాంట్లు

రైల్వే స్టేషన్లలో..సేంద్రియ వ్యర్థ కంపోస్టింగ్‌ ప్లాంట్లు

  • హైదరాబాద్‌, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఏర్పాటు

హైదరాబాద్ : పర్యావరణహితం కోసం దక్షిణ మధ్య రైల్వే మరో రెండు స్టేషన్లలో సేంద్రియ వ్యర్థ కంపోస్టింగ్‌ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. ఇప్పటికే కాచిగూడ, గుంతకల్లు స్టేషన్లలో ఈ యంత్రాలు ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌, కాజీపేట స్టేషన్లలో ప్లాంట్లు పెట్టింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌.. సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఒక్కో యంత్రాన్ని రూ.2.15 లక్షల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసి రైల్వేకు అందించింది. దీనిద్వారా 50 కిలోల వ్యర్థాలను కంపోస్ట్‌ చేసే సామర్థ్యం ఉన్నది. స్టేషన్లలో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాలను ఎరువులుగా మార్చి, స్టేషన్‌ ప్రాంగణాల్లోని ఉద్యానవనాల్లో వాడుకోవచ్చు. ఈ యంత్రాల ద్వారా ఏటా రూ.2 లక్షలు ఆదా చేయవచ్చని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తెలిపారు.