గురువారం 28 జనవరి 2021
Hyderabad - Jun 15, 2020 , 02:30:30

‘పవర్‌ అవర్‌ -4’... ఆన్‌లైన్‌ వేదికపై ఆసక్తికర సంభాషణ

‘పవర్‌ అవర్‌ -4’... ఆన్‌లైన్‌ వేదికపై ఆసక్తికర సంభాషణ

సిటీబ్యూరో: ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆన్‌లైన్‌ వేదికపై నిర్వహించిన ‘పవర్‌ అవర్‌ - 4’ ఆసక్తికరంగా సాగింది. కార్యక్రమానికి ఫిక్కీ జాతీయ పూర్వ అధ్యక్షురాలు పింకీరెడ్డితో పాటు భారతీయ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కపై ‘విలాసం భవిష్యత్‌ , మేక్‌ ఇన్‌ ఇండియా పాత్ర’ అనే అంశంపై  సంభాషణ కొనసాగింది.  ‘వోగ్‌ ఇండియా’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ‘ప్రియా తన్నా’ సంభాషించారు. ఈ సందర్భంగా ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌ పర్సన్‌, పాల్మన్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ ఉషారాణి మన్నె మాట్లాడుతూ, ‘సవ్యసాచితో సంభాషించే అవకాశం రావడం మాకెంతో ఆనందదాయకం. మా ఆశయాలకు అనుగుణంగా ఉన్న ఆయన అభిప్రాయాలు వినడం స్ఫూర్తిదాయకం. వివిధ ప్రాంతాలకు చెందిన ఒరిజినల్‌, ఇంకా డిజైనర్‌ వీవర్స్‌ రూపకల్పనలను ప్రదర్శించేందుకు మేము గత ఏడాది ైస్టెల్‌తత్వాను ప్రారంభించాం. హైదరాబాద్‌ నగరంలో దానిని సుమారు ఎనిమిది వేల మంది సందర్శించారు. ఎంతో మంది కళాకారులకు అది తోడ్పడింది. మరింత ఆధునిక విధానంలో చేనేత కళాకారులు తమ రూపకల్పనలను ప్రదర్శించేందుకు ఎఫ్‌ఎల్‌వో వారికి తోడ్పడుతోంది’ అని అన్నారు.   పింకీరెడ్డి మాట్లాడుతూ తాను తన అన్ని ప్రయాణాల్లో కూడా సుస్థిరత అనే అంశానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. తాను లోటస్‌ హౌస్‌ అనే వెంచర్‌ను చేపటినట్టు తెలిపారు. వేగంగా అంతరించిపోతున్న దేశీయ కళలకు పునరుజ్జీవం, ప్రాచుర్యం కల్పించేందుకు అది తోడ్పడుతుందన్నారు.   


logo