సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 21, 2020 , 00:25:03

జీవ వైవిధ్యంపై ఆన్‌లైన్‌ పోటీలు

 జీవ వైవిధ్యంపై ఆన్‌లైన్‌ పోటీలు

హైదరాబాద్ : అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు సైంటిస్ట్‌ రవీందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, నినాదాలు రాయ డం, పెయింటింగ్‌ తదితర అంశాలపై ఆన్‌లైన్‌ పోటీలను నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జీవవైవిధ్యం టైమ్‌ ఫర్‌ నేచర్‌ అంశంపై నిర్వహించే పోటీల్లో పాల్గొని గురువారం సాయంత్రం 5 గంటల్లోగా [email protected] comకు పంపించాలన్నారు.


logo