బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Aug 24, 2020 , 23:30:35

పోలీస్‌ కస్టడీకి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ నిందితులు

పోలీస్‌ కస్టడీకి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ నిందితులు

మొదటి రోజు విచారణ పూర్తి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌కు సంబంధించిన వ్యవహారంలో నిందితులను కస్టడీలోకి తీసుకొని మొదటి రోజు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు విచారించారు. కలర్‌ ప్రిడిక్షన్‌తో అమాయకులను బోల్తా కొట్టిస్తూ రూ.1107 కోట్ల వరకు వసూలు చేసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ నిర్వాహకులలో నలుగురు డైరెక్టర్లు చైనాకు చెందిన యా హూ, ఢిల్లీ గురుగావ్‌కు చెందిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్‌లను ఈ నెల 13వ తేదీ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నిందితులను నాలుగు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం మొదటి రోజు విచారణలో అంకిత్‌ గతంలో పేటీఎం సంస్థలో పనిచేయడంతో పేమెంట్‌ గేట్‌వే వ్యవహారాల పరిశీలనలో కీలక పాత్ర పోశించినట్లు వెల్లడైంది. ధీరజ్‌ చైనీయులు ప్రారంభించిన పలు డమ్మీ కంపెనీలలో డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలింది. కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌లో పాత్రదారులు ఎవరూ.., సూత్రదారులు ఎవరు అనే విషయంలో స్పష్టత కోసం చైనాకు చెందిన యా హూ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నంలో సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఉన్నారు. దీంతో పాటు పేటీఎం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలలో సాంకేతిక పరమైన అంశాలలో స్పష్టత కోసం పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.