బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 06:50:32

కొనసాగుతున్న జలమండలి సహాయక చర్యలు

కొనసాగుతున్న జలమండలి సహాయక చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరద ప్రభావిత ప్రాంతాల్లో జలమండలి పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక సహాయక పనులకుగాను సుమారు రూ. 2కోట్ల వ్యయంతో 2530అదనపు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా, 2.30 లక్షల క్లోరిన్‌మాత్రలు, 16.40 మెట్రిక్‌ టన్నుల బ్లీచింగ్‌ ఫౌడర్‌ పంపిణీ చేసినట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీర్జాదిగూడ, కిస్మత్‌పురా, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా, సీవరేజీ పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మంచిరేవుల, కిస్మత్‌ఫురా, గోల్డెన్‌హైట్స్‌ ప్రాంతాలలో మూసీ నదికి సమాంతరంగా ఉన్న మంచినీటి పైపులైన్‌ను వంతెన ఎత్తును పెంచడం జరిగిందని అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంప్‌హౌజ్‌లలోకి వరద నీరు చేరకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.