శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Sep 09, 2020 , 00:52:55

సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి

సంపూర్ణ అక్షరాస్యతకు  కృషి చేయాలి

హైదరాబాద్‌ , రంగారెడ్డి జిల్లాల వయోజన విద్య ఆధ్వర్యంలో అక్షరాస్యతా దినోత్సవం 

అహ్మద్‌నగర్‌  : సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  హైదరాబాద్‌ , రంగారెడ్డి జిల్లాల వయోజన విద్య ఉప సంచాలకులు వి.నాగలక్ష్మి (జేఎస్‌ఎస్‌ చైర్‌పర్సన్‌) , ఎ.వెంకట రమణ పేర్కొన్నారు. మంగళవారం విజయనగర్‌ కాలనీలోని జనశిక్షణ సంస్థాన్‌ కార్యాలయంలో రంగారెడ్డి , హైదరాబాద్‌ జిల్లా వయెజన విద్య సంస్థల ఆధ్వర్యంలో జేఎస్‌ఎస్‌ డైరెక్టర్‌ ఎ.మాణయ్య అధ్యక్షతన 54 వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం  నిర్వహిచారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎస్‌.గణేశ్‌, ఏపీఓలు విక్రం వర్మ , మమత , నీరజ , మాలకొండయ్య , సిబ్బంది ఎస్‌.సుధ , నయూం   పాల్గొన్నారు.