ఆదివారం 12 జూలై 2020
Hyderabad - Jun 04, 2020 , 01:41:20

లాక్‌డౌన్‌లో ‘వన్‌ రుపీ’ చాలెంజ్‌..

లాక్‌డౌన్‌లో ‘వన్‌ రుపీ’ చాలెంజ్‌..

సోషల్‌ మీడియాలో విపరీతమైన స్పందన

వచ్చిన డబ్బుతో సహాయ కార్యక్రమాలు 

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: రూపాయే కదా అని తీసిపారేయకండి. అదే రూపాయితో వందలాది మందికి సాయం చేయవచ్చని ‘చాలెంజ్‌' చేశాడో యువకుడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనజీవనం స్తంభించింది. దీంతో నిన్నమొన్నటి వరకు ఉన్న పరిస్థితులు తలకిందులయ్యాయి. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవాలని ఉన్నా ఆర్థికంగా అందరికీ గడ్డుకాలమే. ఈ పరిస్థితుల్లో సామాన్యులు సైతం సాయం చేయగలిగే కార్యక్రమాన్ని రూపొందించాడు పసుపులేటి శశాంక్‌. లాక్‌డౌన్‌ సమయంలో ‘వన్‌ రుపీ చాలెంజ్‌'ను విసిరాడు. ఓ నంబర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి గూగుల్‌ పే ద్వారా కేవలం ఒక్క రూపాయి మాత్రమే దానం చేయాలని కోరగా మంచి స్పందన వచ్చింది. ఈ చాలెంజ్‌లో వేల సంఖ్యల్లో నెటిజన్లు పాల్గొని విరాళాలు అందజేశారు. 

రూ.50 వేలకు పైగా విరాళాలు..

‘వన్‌ రుపీ చాలెంజ్‌'తో శశాంక్‌ రూ.50 వేలకు పైగా విరాళాలు సేకరించారు. వచ్చిన డబ్బుతో మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, గ్లూకో వాటర్‌, స్నాక్స్‌ కొనుగోలు చేసి పారిశుధ్య కార్మికులు, పోలీసులకు అందజేశారు. అంతేకాక వలస కార్మికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. మరోవైపు తన స్నేహితుల సాయంతోనూ శశాంక్‌ కృష్ణానగర్‌, ఉస్మానియా దవాఖాన, ఓల్డ్‌ బోయిగూడ తదితర ప్రాంతాల్లో పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


logo