చీటీల పేరుతో రూ.కోటికి టోకరా

హైదరాబాద్ : అక్రమంగా చీటీల వ్యాపారాన్ని నడుపుతూ సభ్యులకు రూ.కోటి ఎగవేసిన ఓ వ్యాపారిని సోమవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నగర్‌కు చెందిన ప్రింటెడ్ ఇంక్ వ్యాపారి మునుగంటి హరినాథ్ చీటీల వ్యాపారాన్ని నడుపుతున్నాడు. 25 ఏండ్లుగా స్థానికంగా నివాసం ఉండటంతో జవహర్‌నగర్‌కు చెందిన వై రాజేశ్వరరావు ఇతని వద్ద చీటి వేశాడు.
కాగా, రాజేశ్వరరావుకు చెల్లించాల్సిన నగదు ఇవ్వకుండా 2019 నుంచి వాయిదాలు వేస్తున్నాడు. ఇటీవల ఫోన్ చేస్తే కూడా స్పందించట్లేదు. ఆరా తీస్తే హరినాథ్ తన ఆస్తులను భార్య, పిల్లల పేరు మీద బదిలీ చేసి విక్రయించాడని తెలుసుకుని రాజేశ్వరరావు సీసీఎస్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తులో హరినాథ్ దాదాపు రూ.కోటి వరకు సభ్యులకు చెల్లించాల్సి ఉందని తేలింది. అక్రమంగా చీటీల వ్యాపారం నడుపుతున్న హరినాథ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
- బెంగాల్ రక్షణ కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం: బిమన్‌బోస్
- భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..
- చుక్కలు చూపించిన శార్దూల్, సుందర్.. టీమిండియా 336 ఆలౌట్
- కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు షురూ..
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'