మంగళవారం 14 జూలై 2020
Hyderabad - Jun 30, 2020 , 00:14:51

మాస్కు లేకుంటే.. పట్టేస్తారు...

మాస్కు లేకుంటే.. పట్టేస్తారు...

రోడ్లపై తిరిగేవారిపై సీసీ నిఘా 

ఎంవీ యాక్ట్‌కు మాస్కు జరిమానా అదనం

ఐటీఎంస్‌ విధానంలో ఉల్లంఘనల గుర్తింపు

నిరంతరం ట్రాఫిక్‌ పోలీసుల పర్యవేక్షణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నది.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి.. అప్పుడే కరోనాను ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు అవకాశముంటుం ది... ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది... మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగేవారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా ప్రజలు రోడ్లపైకి వస్తూ... బిజీబిజీగా తిరుగుతున్నారు. ఇందులో చాలామంది మాస్కు లు లేకుండా తిరుగుతున్నారు. దీంతో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది..ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. అయితే.. చాలా మంది మాస్కులు ధరిస్తున్నా.. కొంతమంది మా త్రం ధరించడంలేదు. ఇలాంటివారికి శాంతి భద్రతల పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అలాగే నగర ట్రాఫిక్‌ పోలీసులు కూడా నిఘా నేత్రాల ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. కాగా... ఎక్కువగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనివారే మాస్కులు ధరించడంలేదని పోలీసులు గుర్తించి..  వారిపై నిఘాను పటిష్టం చేశారు. 

మాస్కులేకుంటే..ఐటీఎంఎస్‌ గుర్తిస్తాయి

ద్విచక్రవాహనంపై వెళ్లేవారు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలి... కారులో వెళ్లే వారు సీటు బెల్ట్‌ పెట్టుకోవాలి. అయితే..హెల్మెట్‌ లేకుండా తిరిగే ద్విచక్రవాహనదారులకు వాహన నంబర్‌ ఆధారంగా ఈచాలన్లు జారీ అవుతున్నాయి. నగరంలో ఐటీఎంఎస్‌(ఇంటెలిజెన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) అమలులో ఉంది. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఆటోమెటిక్‌గా ఈ కెమెరాలు గుర్తిస్తాయి. ఈ కెమెరాల పర్యవేక్షణ అంతా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఉంటుంది. ఇప్పుడు మాస్కు లు ధరించని వారిని కూడా ఈ కెమెరాలు గుర్తిస్తున్నా యి. ఐటీఎంస్‌ ద్వారా గత పది రోజులుగా మాస్కు ధరించని వారిపై ఫోకస్‌ పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా.. మాస్కు ధరించనివారికి రాష్ట్ర వ్యాప్తంగా చలాన్లు విధిస్తున్నారు. 

హెల్మెట్‌, మాస్కు లేకుంటే జరిమానాలు

ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్‌ పెట్టుకోకుండా, మాస్కు లేకుండా తిరిగితే  మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్‌ జరిమానా, ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం మాస్కుకు సంబంధించిన వెయ్యి రూపాయల జరిమానా పడుతుంది. ఈ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుడి సెల్‌ఫోన్‌కు వెంటనే మెసేజ్‌ వెళ్తుంది. నెల రోజులుగా మాస్కు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇదిలాఉండగా... హెల్మెట్‌ నిండుగా ఉండి, దాని ముందు అద్దం ఉన్నవారికి.. మాస్కు లేకున్నా  జరిమానాలు పడవు. హెల్మెట్‌ అద్దం లేకుండా, నామ మాత్రంగా పెట్టి.. మాస్కు ధరించని వారికే ఐటీఎంస్‌ ఆధారంగా జరిమానాలు విధిస్తున్నారు.

మాస్కు.. మన కోసమే

మాస్కు లేకుండా రోడ్లపైకి వచ్చేవారి సెల్‌ఫోన్లకు జరిమానా పడినట్లు మెసేజ్‌లు వస్తుండటంతో వాహనదారులు అలర్ట్‌ అవుతున్నారు. కొందరు తాము పొరపాటు చేశాం.. మన కోసమే ప్రభుత్వం చెబుతుంది.. వెంటనే సదరు జరిమానా చెల్లించి.. తిరిగి ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. మోటార్‌ వాహనాల చట్టం కింద ఉల్లంఘనలకు పాల్పడినవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కు అనేది మ న కోసమేనని గుర్తిస్తున్నారు. నగరంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుందని, వెయ్యి రూపాయల జరిమానా పడుతుందని గుర్తిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో మాస్కు అనేది ప్రధాన ఆయుధమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరముంది. మాస్కు లేకుండా బయటకు రావద్దు.. ఇతరులతో మాట్లాడే సమయంలో మాస్కును తప్పని సరిగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనాఉంది. 


logo