శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 01:03:49

నిమ్స్‌లో టెలీ కన్సల్టెన్సీ సేవలు పొడిగింపు

నిమ్స్‌లో టెలీ కన్సల్టెన్సీ సేవలు పొడిగింపు

హైదరాబాద్  : నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో ఈనెల 1 నుంచి ప్రారంభించిన టెలీ కన్సల్టెన్సీ సేవలను కొనసాగించేందుకు వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ టెలీ కన్సల్టెన్సీలో రోగుల ఆరోగ్య సమస్యల ఆధారంగా ఫోన్‌లో మందులను సూచిస్తున్నారు. అలాగే వివిధ వైద్యవిభాగాల్లో చికిత్స పొందుతున్న వారు సైతం తమ పాత ప్రిస్కిప్షన్స్‌తో పాటు రక్త, ఇతర పరీక్షల రిపోర్టులను ఫొటో తీసి సంబంధిత వైద్యుడి ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ పంపితే మందులను సూచిస్తున్నారు.

 ఇప్పటికే జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, కార్డియాలజీ, మెడికల్‌ అంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజీ లాంటి కీలక విభాగాల్లో  వైద్య సలహాలు, సూచనలు అందిస్తుండగా, తాజాగా పల్మనరీ మెడిసిన్‌, మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్‌ జెనటిక్స్‌ విభాగాలను సైతం చేర్చారు. ఆయా సేవలు పొందాలనుకునే వారు గూగు ల్‌ ప్లే స్టోర్‌ నుంచి నిమ్స్‌ యాప్‌ www. nims.edu.in\http://www.nims. edu.in>> వెబ్‌సైట్‌, లేక 040-23489 244 నంబరులో సంప్రదించవచ్చు.


logo